LIC Listing: ఎల్ఐసీ లిస్టింగ్ మీద గంపెడాశలు పెట్టుకున్నారా...అయితే ఇది మీకు షాకే...

ఎల్‌ఐసి లిస్టింగ్ ద్వారా మొత్తం రూ .90 వేల కోట్ల మూలధనాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2.10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల టార్గెట్‌ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, వీటిలో ఎక్కువ భాగం LIC Listing, ఐడిబిఐలో వాటా అమ్మకం నుండి వస్తాయని ప్రభుత్వం ఆశ పెట్టుకుంది.

news18-telugu
Updated: May 31, 2020, 4:49 PM IST
LIC Listing: ఎల్ఐసీ లిస్టింగ్ మీద గంపెడాశలు పెట్టుకున్నారా...అయితే ఇది మీకు షాకే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) స్టాక్ మార్కెట్లో LIC Listing, అలాగే ఐడిబిఐ బ్యాంక్ లో వాటాను విక్రయించడానికి 2021 మార్చి తర్వాతే నిర్ణయం తీసుకునే వీలుంది. ఎల్‌ఐసి లిస్టింగ్ ద్వారా మొత్తం రూ .90 వేల కోట్ల మూలధనాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2.10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల టార్గెట్‌ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, వీటిలో ఎక్కువ భాగం LIC Listing, ఐడిబిఐలో వాటా అమ్మకం నుండి వస్తాయని ప్రభుత్వం ఆశ పెట్టుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో LIC Listing చేసే చాన్స్ తక్కువే...

2020 ఫిబ్రవరి 1 న 2020-21 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌లో ఎల్‌ఐసి లిస్టింగ్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, LIC Listing జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

BPCL బిడ్డింగ్ కూడా వాయిదా పడే చాన్స్
కోవిడ్ -19 కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఒఎంసి) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) ను ప్రైవేటీకరించడానికి బిడ్డింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించింది. ఇప్పుడు దాని గడువు 2020 జూలై 31 కి ఒక నెల పెంచింది.

LIC, IDBI బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా ఎంత?
ప్రస్తుతం, ఎల్‌ఐసిలో ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉండగా, ఐడిబిఐలో ప్రభుత్వం 46.5 శాతం వాటాను కలిగి ఉంది. మార్కెట్ పరిస్థితిలో మెరుగుదల ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పుడు ఎల్ఐసి, ఐడిబిఐ బ్యాంకులలో వాటాలను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఈ పరిస్థితిలో లిస్టింగ్ కు వెళ్లడం అంత తెలివైన నిర్ణయం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.లిస్టింగ్ కు ఉన్న అడ్డంకులు
వాల్యుయేషన్‌కు అదనంగా, ఎల్‌ఐసి లిస్టింగ్ కు ముందు రెగ్యులేటరీ క్లియరెన్స్ అవసరం. ఇందులో చాలా ముఖ్యమైనది ఎల్ఐసి చట్టంలో మార్పులు చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి, గడిచిన దశాబ్దాలలో ఇదే అతిపెద్ద లిస్టింగ్ ఇదే కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇన్సురెన్స్ మార్కెట్లో ఎల్‌ఐసి దే ఆధిపత్యం
విశేషమేమిటంటే, ఎల్‌ఐసి దేశంలో అతిపెద్ద ఇన్సురెన్స్ సంస్థ. దేశంలో 70 శాతం బీమా మార్కెట్‌ను కలిగి ఉంది. బీమా పాలసీల సంఖ్య ఆధారంగా ఎల్‌ఐసి మొత్తం మార్కెట్ వాటాను 76.28 శాతం కలిగి ఉండగా, ఎల్‌ఐసి మొదటి సంవత్సరం ప్రీమియం ఆధారంగా మొత్తం మార్కెట్ వాటాను 71 శాతం కలిగి ఉంది.

13 త్రైమాసికాల తర్వాత LICకి లాభాలు

ఎల్‌ఐసికి అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి, వాటిలో ఒకటి ఐడిబిఐ బ్యాంక్ కూడా ఒకటి. శనివారం విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఐడిబిఐ బ్యాంక్ ఈ త్రైమాసికంలో 135 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. పెద్ద ఎత్తున రుణాలు తిరిగి రావడం వల్ల బ్యాంకుకు ఈ లాభం వచ్చింది. అంతకుముందు, ఐడిబిఐ బ్యాంక్ గత 13 త్రైమాసికాలలో నష్టాలను ఎదుర్కొంది.

ఇక 2019 జనవరిలో ఎల్‌ఐసి 51 శాతంతో ఐడిబిఐ బ్యాంక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం రూ .21,624 కోట్లకు ఎల్‌ఐసి సొంతం చేసుకుంది. ప్రస్తుతం, రిజర్వ్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంకుపై పిసిఎ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసింది. అయితే, ఇప్పుడు రిటర్న్ ఆన్ ఆస్తులు మినహా పిసిఎ (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్) ఫ్రేమ్‌వర్క్ అన్ని ఇతర పరిమితులను పూర్తి చేసినట్లు బ్యాంక్ తెలిపింది.
First published: May 31, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading