హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ... రెగ్యులర్ ఇన్‌కమ్ అందించే ప్లాన్

LIC Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ... రెగ్యులర్ ఇన్‌కమ్ అందించే ప్లాన్

LIC Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ... రెగ్యులర్ ఇన్‌కమ్ అందించే ప్లాన్
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ... రెగ్యులర్ ఇన్‌కమ్ అందించే ప్లాన్ (ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy | ఏదైనా పెన్షన్ పాలసీ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఎల్ఐసీ నుంచి న్యూ పెన్షన్ ప్లస్ (New Pension Plus) పేరుతో కొత్త పాలసీ వచ్చింది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారులు పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి మరో కొత్త పెన్షన్ పాలసీ (Pension Policy) వచ్చింది. న్యూ పెన్షన్ ప్లస్ (New Pension Plus) పేరుతో ఈ ప్లాన్‌ను ప్రకటించింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిజ్యువల్ పెన్షన్ ప్లాన్. పాలసీహోల్డర్లు క్రమశిక్షణతో క్రమబద్ధంగా పొదుపు చేయడానికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ఎల్ఐసీ పాలసీ గడువు ముగిసిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ఎంచుకొని రెగ్యులర్ ఇన్‌కమ్ పొందొచ్చు. అంటే పెన్షన్ లాగా పొందొచ్చు. సింగిల్ ప్రీమియం లేదా రెగ్యులర్ ప్రీమియం పద్ధతిలో ఈ పాలసీ తీసుకోవచ్చు. వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలనుకునేవారికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ ప్లాన్ వివరాలివే...

ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ సింగిల్ ప్రీమియం లేదా రెగ్యులర్ ప్రీమియం పాలసీ. సింగిల్ ప్రీమియంలో కనీసం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేయాలి. రెగ్యులర్ ప్రీమియం అయితే కనీసం నెలకు రూ.3,000, మూడు నెలలకు రూ.9,000, ఆరు నెలలకు రూ.16,000, ఏడాదికి రూ.30,000 చెల్లించాలి. గరిష్ట పరిమితి లేదు. కనీస వయస్సు 25 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 75 ఏళ్లు. కనీసం 10 ఏళ్ల నుంచి గరిష్టంగా 52 ఏళ్ల వరకు గడువు ఎంచుకోవచ్చు.

Online Shopping: అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్... ఈ 5 క్రెడిట్ కార్డ్స్‌తో అదిరిపోయే ఆఫర్స్

మార్కెట్ రిటర్న్స్‌పై ఈ పాలసీ రిటర్న్స్ ఆధారపడుతుంది. పాలసీహోల్డర్లు నాలుగు రకాల ఫండ్స్ ఎంచుకోవచ్చు. బాండ్, సెక్యూర్డ్, బ్యాలెన్స్‌డ్, గ్రోత్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. తాము కోరుకున్నప్పుడు ఫండ్ డిస్ కంటిన్యూ చేయొచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఫండ్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీలో ఐదేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత యూనిట్స్‌ను కొంత విత్‌డ్రా చేసుకోవచచ్చు. ఈ పాలసీలో లోన్ సదుపాయం కూడా ఉంది.

ఇందులో డెత్ బెనిఫిట్ చూస్తే పాలసీహోల్డర్ మరణించిన రోజు యూనిట్ ఫండ్ వ్యాల్యూను బట్టి డబ్బులు చెల్లిస్తుంది ఎల్ఐసీ. లేదా మొత్తం ప్రీమియం కన్నా 105 శాతం నామినీకి లభిస్తుంది. ల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ పాలసీలో 5 శాతం నుంచి 15.5 శాతం వరకు గ్యారెంటీడ్ అడిషన్స్ కూడా లభిస్తాయి. పాలసీ ఏడాదిని బట్టి గ్యారెంటీడ్ అడిషన్స్ మారుతుంది.

Voter ID Aadhaar Link: ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఈ సింపుల్ స్టెప్స్‌తో చేయండి

ఎల్ఐసీ నుంచి సరళ్ పెన్షన్ పేరుతో మరో పెన్షన్ ప్లాన్ ఉంది. ఈ పాలసీలో రెండు ఆప్షన్స్ ఉంటాయి. లైఫ్ యాన్యుటీ ఆప్షన్ ఎంచుకుంటే జీవితాంతం యాన్యుటీ అంటే పెన్షన్ లభిస్తుంది. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 40 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 80 ఏళ్లు. కనీసం నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 చొప్పున పెన్షన్ పొందొచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: LIC, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు