LIC New Plan: ఎల్ఐసీ నుంచి కొత్తగా ఆరోగ్య రక్షక్ పాలసీ.. ప్లాన్ ప్రయోజనాలివే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీ పేరుతో మరో కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వివరాలు, ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కరోనా మహమ్మారి అందరినీ ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తుందన్న సంగతి ఎవరికీ తెలియదు. ఆర్థిక వనరులు సరిగ్గా ఉండని ఈ పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఎల్ఐసీ కూడా ఆరోగ్య రక్షక్ అనే కొత్త పాలసీని తీసుకొచ్చింది. జులై 19న విడుదల చేసిన ఈ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య రక్షక్ పాలసీ.. ముందుగా నిర్ధారించిన కొన్ని ఆరోగ్య సమస్యలను కవర్ చేస్తూ ఎమర్జెన్సీ సమయాల్లో ఆదుకుంటుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి, అతడి కుటుంబానికి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎల్‌ఐపీ వెల్లడించింది. ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే ఆరోగ్య రక్షక్ పాలసీ చాలా విభిన్నమైనది. ఇందులో ముఖ్యమైన తేడా తిరిగి డబ్బును చెల్లించడంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు.
Flipkart Big Saving Day: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లపై భారీ తగ్గింపు.. వివరాలివే

సాధారణంగా ఆరోగ్య బీమా అంటే హాస్పిటల్ లో చేరిన తర్వాత అయిన మొత్తాన్ని బిల్స్ ఆధారంగా తిరిగి చెల్లించేవే అయి ఉంటాయి. ఇన్సూరెన్స్ చేసిన లిమిట్ ఆధారంగా ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి ఆయా సంస్థలు. కానీ ఆరోగ్య రక్షక్ మాత్రం ఎంతకైతే ఇన్సూరెన్స్ చేశారో దానికి సమానమైన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. మెడికల్ బిల్లులతో సంబంధం లేకుండా హాస్పిటల్ ఛార్జీలు ఎంతైనా ఈ మొత్తాన్ని అందిస్తుంది.

ఒక వ్యక్తి తను, తన భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు ఈ ఇన్సూరెన్స్ వర్తించేలా తీసుకోవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల లోపు వయసు ఉన్న భాగస్వామి, తల్లిదండ్రులతో పాటు 90 రోజుల నుంచి 20 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ వయసులో ఉన్నవారికి పాలసీని తీసుకుంటే అది తల్లిదండ్రులు లేదా ఆ వ్యక్తి, భాగస్వామి వయసు 80 ఏళ్లు వచ్చే వరకు, పిల్లలకు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు.. ఈ పాలసీ కవర్ వర్తిస్తుంది.

పాలసీ ద్వారా అందే మరికొన్ని ప్రయోజనాలు
- బెనెఫిట్ లిమిట్ ఎంచుకోవడంలో ఫ్లెక్సిబిలిటీ, ప్రీమియంలో కూడా ఫ్లెక్సిబిలిటీ
- హాస్పిటలైజేషన్ సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
- మెడికల్ ఖర్చులు ఎంతైనా ఒకేసారి పెద్ద మొత్తాన్ని తిరిగి అందిస్తుంది.
- ఒక వ్యక్తి, తన కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఆ వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇన్సూరెన్స్ కవర్ కొనసాగుతుంది.
- కేటగిరీ 1, 2 లలో ఉన్న మేజర్ సర్జరీలు చేయించుకుంటే ఒక సంవత్సరం పాటు ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు.
- అంబులెన్స్, హెల్త్ చెకప్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

ఇందులో మరిన్ని రైడర్లు తీసుకొని పాలసీని మరింత ప్రయోజనకరంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు అందుబాటులో ఉంది.
Published by:Nikhil Kumar S
First published: