• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • LIC LAUNCHED A CONTACTLESS PREPAID GIFT CARD SHAGUN HERE FULL DETAILS NS GH

LIC Gift card: గిఫ్ట్‌కార్డ్‌ సేవల్లో ఎల్‌ఐసీ.. ‘షగున్‌’ పేరుతో విడుదల.. ప్రత్యేకతలివే..

ప్రతీకాత్మక చిత్రం

‘షగున్‌’ పేరుతో ఎల్‌ఐసీ ఓ గిఫ్ట్‌ కార్డును విడుదల చేసింది. ఐడీబీఐ, రూపే ప్లాట్‌ఫామ్‌తో కలసి ఎల్‌ఐసీ ఈ కార్డును లాంఛ్ చేసింది.

  • Share this:
బంధువులు, స్నేహితుల ఇంట్లో శుభకార్యాలకు వెళ్లినప్పుడు గిఫ్ట్‌లు ఇవ్వడం ఆనవాయితీ. కొందరు మాత్రం డబ్బులు కూడా ఇస్తుంటారు. ఇది కాకుండా మరో పద్ధతి ఉంది. అదే గిఫ్ట్‌ కార్డ్‌. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్‌ పెరుగుతూ వస్తోంది. అందుకే ‘షగున్‌’ పేరుతో ఎల్‌ఐసీ ఓ గిఫ్ట్‌ కార్డును తీసుకొచ్చింది. ఐడీబీఐ, రూపే ప్లాట్‌ఫామ్‌తో కలసి ఎల్‌ఐసీ ఈ కార్డును లాంచ్‌ చేసింది. ఏంటీ కార్డు, దీని ఫీచర్లేంటో చూద్దాం! దేశం మొత్తం క్యాష్‌లెస్‌ అవుతోంది. ఈ క్రమంలో గిఫ్ట్‌ల విషయంలోనూ అలానే ఆలోచిద్దాం అంటే గిఫ్ట్‌ కార్డు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ కార్డు ఎల్‌ఐసీ అసోసియేట్లు, సబ్సిడైజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. అఫీషియల్‌ కాన్ఫరెన్స్‌లు, ఫంక్షన్లలో వీటిని వినియోగించొచ్చని ఎల్‌ఐసీ చెబుతోంది. గిఫ్ట్‌లు ఇవ్వడంలో ఈ కార్డు కొత్త పుంతలు తొక్కిస్తుందని ఎల్‌సీఐ గొప్పగా చెబుతోంది.
Godrej Housing Finance: గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి కొత్త ఈఎంఐ స్కీమ్
SBI Offer: ఎస్‌బీఐలో ఆ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ఇన్స్యూరెన్స్

‘షగున్‌’ కార్డు ఫీచర్లు ఏంటంటే?
షగున్‌ కార్డులో ₹500 నుండి ₹10 వేల వరకు లోడ్‌ చేసుకోవచ్చు. మూడు సంవత్సరాల్లో ఈ కార్డులోని డబ్బును వినియోగదారుడు వాడుకోవచ్చు. ఈ కార్డు దేశంలో లక్షల షాపులు, ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో లావాదేవీల చెల్లింపునకు వాడుకోవచ్చట. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌, పెట్రోల్‌ పంప్స్‌, రెస్టారెంట్లు, జ్యువెలరీ స్టోర్స్‌లో ఈ కార్డును వినియోగించుకోవచ్చు. మొబైల్‌ వ్యాలెట్స్‌, ఈ కామర్స్‌ పోర్ట్స్‌లో యుటిలిటీ బిల్స్‌, విమానం, రైల్‌, బస్సు టికెట్ల లాంటివి కొనుగోలు చేసినప్పుడు చెల్లింపులు చేయొచ్చు.

‘షగున్‌’ కార్డులో కాంటాక్ట్‌లెస్‌ ఫీచర్‌ కూడా ఉంది. ట్యాప్‌ అండ్‌ గో విధానంలోనూ ఈ కార్డును వాడుకోవచ్చు. దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషీన్ల దగ్గర కాంటాక్ట్‌ లెస్‌ పేమెంట్లు చేయొచ్చు. అంటే పిన్‌ ఎంటర్‌ చేయకుండానే... రూ.ఐదు వేల వరకు డబ్బును కాంటాక్ట్‌ లెస్‌ విధానంలో చెల్లించొచ్చు. ఈ కార్డును పర్సనలైజ్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంది. అంటే ఎవరికైనా గిఫ్ట్‌గా ఇచ్చేటప్పుడు దాని మీద మీ సందేశం రాసి ఇవ్వొచ్చు. అంతేకాదు ఈ కార్డును ఎం పాస్‌బుక్‌ అనే మొబైల్‌ యాప్‌కు ఆటో లింక్‌ అయి ఉంటుంది. దాని వల్ల ఆ యాప్‌లో మీ కార్డుకు సంబంధించిన సమాచారాన్ని రియల్‌ టైమ్‌లో చూసుకోవచ్చు. ఎంత ఖర్చు పెట్టారు, ఇంకెంత బ్యాలెన్స్‌ ఉంది అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి.
Published by:Nikhil Kumar S
First published: