మీరు ఏదైనా ఎల్ఐసీ పాలసీ (LIC Policy) తీసుకోవాలనుకుంటున్నారా? మెచ్యూరిటీ తర్వాత కూడా బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా (LIC) అన్ని వయస్సులు, అన్ని వర్గాలకు ప్రత్యేక పాలసీలను అందిస్తోంది. కొన్ని ఎల్ఐసీ పాలసీలు (LIC Policy) మంచి రిటర్న్స్ ఇస్తుండటంతో ఆ ప్లాన్స్ బాగా పాపులర్ అవుతుంటాయి. అలాంటి ప్లాన్స్‌లో ఒకటి ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ (LIC Jeevan Umang Policy). కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు ప్రతీ ఏటా కొంత ఆదాయం ఇవ్వడమే ఈ ప్లాన్ ప్రత్యేకత. మెచ్యూరిటీ వరకు ప్రీమియం పూర్తిగా చెల్లించిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ లభిస్తాయి. దీంతో పాటు ప్రతీ ఏటా కొంత మొత్తం ఆదాయం కూడా పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, హోల్ ఇన్స్యూరెన్స్ పాలసీ.
కనీసం రూ.2,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ టర్మ్ 100 -వయస్సు ఉంటుంది. అంటే 30 ఏళ్ల వయస్సులో పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 70 ఏళ్లు ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస వయస్సు 90 రోజులు ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. మెచ్యూరిటీ వయస్సు 100 ఏళ్లు. పాలసీ తీసుకునేవారి వయస్సు 8 ఏళ్ల లోపు ఉంటే రెండేళ్ల తర్వాత రిస్క్ కవర్ మొదలవుతుంది. ఒకవేళ 8 ఏళ్ల పైన ఉంటే రిస్క్ కవర్ వెంటనే ప్రారంభం అవుతుంది.
Bank Charges: ఆ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా? జూన్ 15 నుంచి కొత్త ఛార్జీలు
ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ రిటర్న్స్ విషయానికి వస్తే చివరి ప్రీమియం చెల్లించిన తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు 8 శాతం చొప్పున లెక్కించి ప్రతీ ఏటా సర్వైవల్ బెనిఫిట్ ఇస్తారు. ఇలా 99 ఏళ్ల వయస్సు వచ్చేవరకు తీసుకోవచ్చు. 100 ఏళ్లు పూర్తైన తర్వాత మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. ఉదాహరణకు 26 ఏళ్ల వయస్సు ఉన్న 30 ఏళ్ల టర్మ్‌తో ఓ వ్యక్తి రూ.4,50,000 సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకుంటే నెలకు రూ.1,350 ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.45 చొప్పున చెల్లించాలి. ఏటా రూ.15,882 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 30 ఏళ్లలో చెల్లించే ప్రీమియం రూ.4,76,460 అవుతుంది.
UPI Payment: యూపీఐ పేమెంట్ ఫెయిలై డబ్బులు కట్ అయ్యాయా? వాట్సప్‌లో కంప్లైంట్ చేయండిలా
రిటర్న్స్ విషయానికి వస్తే పాలసీ తీసుకున్న వ్యక్తి 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే అతనికి 31వ ఏడాది నుంచి ఏటా రూ.36,000 రిటర్న్స్ లభిస్తాయి. ఇలా 99 ఏళ్ల వయస్సు వచ్చే వరకు తీసుకోవచ్చు. 100వ సంవత్సరంలో సుమారు రూ.36 లక్షల రిటర్న్స్ కూడా వస్తాయి. ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకునేవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, LIC, Life Insurance, Personal Finance