LIC JEEVAN SHIROMANI POLICY OFFERS OVER RS 1 CRORE BENEFITS FOR HIGH NET WORTH INDIVIDUALS KNOW PLAN DETAILS SS
LIC Policy: ఎల్ఐసీ నుంచి కోటి రూపాయల పాలసీ... ప్రీమియం ఎంతంటే
LIC Policy: ఎల్ఐసీ నుంచి కోటి రూపాయల పాలసీ... ప్రీమియం ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)
LIC Policy | కోటి రూపాయల పైనే ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునేవారి కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి ఓ ప్రత్యేక ప్లాన్ ఉంది. కనీసం కోటి రూపాయల ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండేళ్ల క్రితం ఎల్ఐసీ జీవన్ శిరోమణి (LIC Jeevan Shiromani) పాలసీని తీసుకొచ్చింది. భారీ మొత్తంలో సంపాదించేవారికి, ధనవంతుల కోసం ప్రత్యేకంగా ఈ పాలసీని రూపొందించింది. ఇందులో కనీసం కోటి రూపాయలకు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో వారికి కోటి రూపాయలకు పైనే మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, లైఫ్ అష్యూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. ఎక్కువ ప్రయోజనాలతో ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ కూడా ఒకటి. మనీ బ్యాక్ కూడా వస్తుంది కాబట్టి నిర్ణీత సమయంలో డబ్బులు కావాలనుకునేవారికి ఉపయోగపడే ప్లాన్ ఇది.
ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ కనీస సమ్ అష్యూర్డ్ రూ.1,00,00,000. అంటే కోటి రూపాయలు. గరిష్ట పరిమితి లేదు. పాలసీ గడువు 14 ఏళ్లు, 16 ఏళ్లు, 18 ఏళ్లు, 20 ఏళ్లు. ఎంచుకున్న గడువులో నాలుగేళ్లు తగ్గించి మిగతా సంవత్సరాలపు ప్రీమియం చెల్లించాలి. అంటే 14 ఏళ్ల పాలసీకి 10 ఏళ్లు, 16 ఏళ్ల పాలసీకి 12 ఏళ్లు, 18 ఏళ్ల పాలసీకి 14 ఏళ్లు, 20 ఏళ్ల పాలసీకి 16 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్ట వయస్సు పాలసీ గడువును బట్టి మారుతుంది.
ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 14 ఏళ్ల టర్మ్‌తో కోటి రూపాయల సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ తీసుకుంటే 10 ఏళ్ల పాటు ఏడాదికి రూ.10,75,550 + జీఎస్‌టీ చొప్పున ప్రీమియం చెల్లించాలి. అతనికి 10, 12 పాలసీ యానివర్సరీల్లో రూ.30,00,000 చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.92,50,000 లభిస్తుంది. మొత్తం రూ.1,52,50,000 బెనిఫిట్ లభిస్తుంది.
మరో ఉదాహరణ చూస్తే 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 20 ఏళ్ల టర్మ్‌తో కోటి రూపాయల సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ తీసుకుంటే 16 ఏళ్ల పాటు ఏడాదికి రూ.6,93,350 + జీఎస్‌టీ చొప్పున ప్రీమియం చెల్లించాలి. అతనికి 16, 18 పాలసీ యానివర్సరీల్లో రూ.45,00,000 చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.95,50,000 లభిస్తుంది. మొత్తం రూ.1,85,50,000 బెనిఫిట్ లభిస్తుంది. వీటితో పాటు నాన్ గ్యారెంటీడ్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది.
భారీ మొత్తంలో డబ్బులు ఉన్నవారు, ఎక్కువ ఆదాయ వర్గాల్లో ఉన్నవారికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. రైడర్స్, లోన్ సదుపాయం కూడా ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.