హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC: ఈ పాలసీతో రూ.28 లక్షల రిటర్న్.. రూ.15వేల పెన్షన్ బెనెఫిట్స్

LIC: ఈ పాలసీతో రూ.28 లక్షల రిటర్న్.. రూ.15వేల పెన్షన్ బెనెఫిట్స్

ఈ పాలసీతో రూ.28 లక్షల రిటర్న్.. రూ.15వేల పెన్షన్ బెనెఫిట్స్ (symbolic image)

ఈ పాలసీతో రూ.28 లక్షల రిటర్న్.. రూ.15వేల పెన్షన్ బెనెఫిట్స్ (symbolic image)

LIC Policy: ఎల్ఐసీలో రకరకాల పాలసీలు ఉన్నాయి. ఇదో మంచి పాలసీ. ఇందులో ఎంత అమౌంట్ కట్టాలో, ఎలా కట్టాలో, ఎంత లాభం వస్తుందో... పూర్తి వివరాలు తెలుసుకుందాం.

LIC Policy: స్టాక్ మార్కె్ట్లలో పెట్టుబడి పెడితే... రిస్క్ ఎక్కువ... అదే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీల్లో అయితే... కచ్చితమైన మంచి రిటర్న్ రావడమే కాదు... టాక్స్ బెనెఫిట్స్ కూడా ఉంటాయి. ప్రజల్లో సేవింగ్స్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ టాక్స్ మినహాయింపులు కల్పిస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకునే పాలసీ జీవన్ ప్రగతి స్కీమ్ (Jeevan Pragati scheme). పేరుకు తగ్గట్టే ఇది మన జీవితంతోపాటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది భవిష్యత్తుకు మంచి బాట వేస్తుంది. ఇది తీసుకున్నవారు... రోజుకు రూ.200 పెట్టుబడి పెట్టాలి. అలా రూ.20 ఏళ్లు పెడితే... మొత్తం పెట్టిన పెట్టుబడి సుమారు రూ.15 లక్షల దాకా అవుతుంది. దానికి రిటర్న్ రూ.28 లక్షలు వస్తుంది. అంతేకాదు... రూ.15,000 పెన్షన్ కూడా ఇస్తారు. అంటే... మొత్తం వచ్చేది రూ.29 లక్షలకు పైనే.

LIC Jeevan Pragati Plan: ఈ ప్లాన్ వివరాలు -

- ఈ పాలసీలో రిస్క్ కవర్... ప్రతి ఐదేళ్లకోసారి పెరుగుతుంది.

- మొదటి ఐదేళ్ల పెట్టుబడికి రిస్క్ కవర్ అదే ఉంటుంది.

- 6 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ 25 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుంది.

- 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి పెరుగుతుంది.

- మీరు 20 ఏళ్ల వరకూ చెల్లిస్తూ... మధ్యలో మనీ తీసుకోకపోతే... మీకు రిస్క్ కవర్ 200 శాతానికి పెరుగుతుంది.

ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.2 లక్షలకు పాలసీ తీసుకుంటే... మొదటి ఐదేళ్ల వరకూ బీమా కవరేజీ అంతే ఉంటుంది. ఆ తర్వాత 6-10 మధ్య అది రూ.2.5 లక్షలు ఉంటుంది. అలాగే 11-15 ఏళ్ల మధ్య అది రూ.3లక్షలు ఉంటుంది. 16-20 ఏళ్ల మధ్య బీమా కవరేజీ రూ.4 లక్షలు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Savings Scheme: తక్కువ పెట్టుబడి. భారీ రిటర్నుకు సరైన స్కీమ్

Death Benefit: మరణ ప్రయోజనాలు:

పాలసీదారు మధ్యలోనే చనిపోతే... నామినీకి... మెచ్చూరిటీ నాడు మినిమం గ్యారెంటీ అమౌంట్ చెల్లిస్తారు. ఈ స్కీములు యాక్సిడెంటల్ డెత్, అంగవైకల్య రైడర్స్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Terms of LIC Jeevan Pragati Plan: ఈ పాలసీ నిబంధనలను చూస్తే....

- 12 నుంచి 45 ఏళ్ల మధ్య వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.

- పాలసీ కనీస గడువు 12 ఏళ్లు, గరిష్ట గడువు 20 ఏళ్లు.

- మెచ్యూరిటీ నాటికి గరిష్ట వయసు పరిమితి 65 ఏళ్లు.

- కనీస కవర్ అమౌంట్ రూ.1.5 లక్షలు.

First published:

Tags: Investment Plans, Life Insurance, Saving money, Savings, Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు