రోజూ రూ.35 చెల్లిస్తే రూ.4.72 లక్షలు మీవే...

మీకు పొదుపు చేసేందుకు, అవసరమైనప్పుడు డబ్బు వాడుకునేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకున్న కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించొచ్చు. ప్రతీ ఐదేళ్లకోసారి లైఫ్ కవర్ పెరుగుతూ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్, అంగవైకల్యం కోసం రైడర్ పొందొచ్చు. అయితే వాటికోసం కాస్త అదనంగా డబ్బులు చెల్లించాలి.

news18-telugu
Updated: November 12, 2018, 3:49 PM IST
రోజూ రూ.35 చెల్లిస్తే రూ.4.72 లక్షలు మీవే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా పాలసీలున్నాయి. చాలావరకు పాలసీలు మంచి లాభాలు ఇచ్చేవే. అయితే అందులో సరైన పాలసీ ఎంచుకుంటే మీరు లక్షాధికారులు కావొచ్చు. అలాంటి పాలసీల్లో ఒకటి జీవన్ ప్రగతి ప్లాన్. ఇది ఎండోమెంట్ ప్లాన్. మీకు పొదుపు చేసేందుకు, అవసరమైనప్పుడు డబ్బు వాడుకునేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకున్న కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించొచ్చు. ప్రతీ ఐదేళ్లకోసారి లైఫ్ కవర్ పెరుగుతూ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్, అంగవైకల్యం కోసం రైడర్ పొందొచ్చు. అయితే వాటికోసం కాస్త అదనంగా డబ్బులు చెల్లించాలి. ఆ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

మెచ్యూరిటీ బెనిఫిట్స్: పాలసీ గడువు ముగిసిన తర్వాత సమ్ అష్యూర్డ్+బోనస్+ఫైనల్ అడిషనల్ బోనస్(అప్పటికి ఏదైనా ఉంటే) లభిస్తాయి.

డెత్ బెనిఫిట్స్: పాలసీ కడుతున్న సమయంలో పాలసీహోల్డర్ చనిపోతే నామినీకి సమ్ అష్యూర్డ్+బోనస్+ఫైనల్ అడిషనల్ బోనస్(అప్పటికి ఏదైనా ఉంటే) లభిస్తాయి. రిస్క్ కవర్ ప్రతీ ఐదేళ్లకోసారి 25% చొప్పున పెరుగుతుంది.
ఫైనల్ అడిషనల్ బోనస్: పాలసీ ముగిసిన తర్వాత ఎల్ఐసీ అదనపు బోనస్ ఇస్తుంది. ఇది ఎల్ఐసీ పట్ల పాలసీదారుడు విధేయంగా ఉన్నందుకు ఇచ్చే లాయల్టీ బోనస్. అయితే ఇది 15 ఏళ్ల గడువు దాటిన పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది. లాయల్టీ బోనస్ ఎంత అనేది ప్రతీ సంవత్సరం ఎల్ఐసీ వెల్లడిస్తుంది.

రోజూ రూ.35 చెల్లిస్తే రూ.4.72 లక్షలు మీవే..., LIC Jeevan Pragati plan: You can get Rs.4,72,500 with bouns by saving Rs.34 Per day
ప్రతీకాత్మక చిత్రం


ఎల్ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్ ఎలా లెక్కించాలి?
ఉదాహరణకు 27 ఏళ్ల రాజేష్ అనే వ్యక్తి 20 ఏళ్లకు రూ.2,50,000 మొత్తానికి ఎల్ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. ఏటా ప్రీమియం రూ.12,773 చెల్లించాల్సి వస్తుంది. అంటే రోజుకు రూ.34. ప్రతీ ఏటా 20 ఏళ్ల పాటు రాజేష్ మొత్తం ప్రీమియం చెల్లిస్తే ఈ లాభాలుంటాయి.1. మెచ్యూరిటీ: సమ్ అష్యూర్డ్+బోనస్+ఫైనల్ అడిషనల్ బోనస్(అప్పటికి ఏదైనా ఉంటే) లభిస్తాయి. అంటే... సమ్ అష్యూర్డ్ రూ.2,50,000 వస్తాయి.
2. బోనస్: ఒకవేళ ఎల్ఐసీ రూ.1000 సమ్ అష్యూర్డ్‌‍కు రూ.42 చొప్పున ప్రతీ ఏడాది బోనస్ ఇస్తుందనుకుందాం. ఆ లెక్కన 42 x రూ.2,50,000/1,000 = Rs. 10,500 బోనస్ లభిస్తుంది. ఆ లెక్కన రూ.10,500 x 20 ఏళ్లు= రూ.2,10,000 వస్తాయి.
3. ఫైనల్ అడిషనల్ బోనస్: రూ.1000 కి రూ.50 బోనస్ అనుకుంటే... 50 x 2,50,000/1,000 = రూ.12,500 బోనస్ వస్తుంది.

ఈ లెక్కన రాజేష్ పాలసీ మెచ్యూరిటీ తర్వాత (1)+(2)+(3)= రూ.2,50,000+రూ.2,10,000+రూ.12,500= రూ.4,72,500 వస్తాయి.

రోజూ రూ.35 చెల్లిస్తే రూ.4.72 లక్షలు మీవే..., LIC Jeevan Pragati plan: You can get Rs.4,72,500 with bouns by saving Rs.34 Per day

జీవన్ ప్రగతి ప్లాన్ ఎవరు తీసుకోవచ్చు?
వయస్సు: 12 నుంచి 45 ఏళ్లు
పాలసీ వ్యవధి: 12 నుంచి 20 ఏళ్లు
మెచ్యూరిటీకి గరిష్ట వయస్సు: 65 ఏళ్లు
కనీస కవరేజీ: రూ.1,50,000; గరిష్టం: ఎలాంటి పరిమితిలేదు

ఒకవేళ పాలసీ ప్రీమియం మూడేళ్లు చెల్లించి సరెండర్ చేస్తే ఎంత వస్తుందో తెలుసుకునేందుకు సరెండర్ వ్యాల్యూ క్యాలిక్యులేటర్ ఉపయోగించొచ్చు.

ఇవి కూడా చదవండి:

మీరు ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో తెలుసా?

లోన్ డిఫాల్ట్ అయిందా? క్రెడిట్ స్కోర్ ఇలా పెంచుకోండి...

ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో లాభాలేంటీ? ఎలా వాడుకోవాలి?

ష్యూరిటీ సంతకం పెడుతున్నారా? అయితే జాగ్రత్త...

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: November 12, 2018, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading