Home /News /business /

LIC JEEVAN LABH POLICY SAVE RS 252 PER DAY AND GET UP TO RS 20 LAKHS RETURNS SS

LIC Policy: ఈ పాలసీతో మెచ్యూరిటీ తర్వాత రూ.20 లక్షలు... ప్రీమియం ఎంతంటే

LIC Policy: ఈ పాలసీతో మెచ్యూరిటీ తర్వాత రూ.20 లక్షలు... ప్రీమియం ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy: ఈ పాలసీతో మెచ్యూరిటీ తర్వాత రూ.20 లక్షలు... ప్రీమియం ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy | ఎల్ఐసీ పాలసీ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? ఓ ఎల్ఐసీ పాలసీలో మెచ్యూరిటీ సమయంలో రూ.20 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఇందుకోసం ప్రీమియం ఎంత చెల్లించాలో తెలుసుకోండి.

    మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎల్ఐసీ అన్ని వర్గాలకు కావాల్సిన పాలసీలను (LIC Policy) అందిస్తోంది. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా పాలసీ ఎంచుకోవచ్చు. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ లాభ్ పాలసీ (LIC Jeevan Labh Policy) ఒకటి. ఈ పాలసీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలసీలో రోజుకు రూ.252 చొప్పున చెల్లిస్తే చాలు మెచ్యూరిటీ నాటికి రూ.20 లక్షల వరకు పొందొచ్చు. ఈ పాలసీతో పన్ను లాభాలు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం పాలసీ తీసుకోవాలనుకుంటే ఇది కూడా ఓ బెస్ట్ పాలసీ.

    ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీలో కనీస సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ట పరిమితి లేదు. కనీసం 8 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీస పాలసీ టర్మ్ 16 ఏళ్లు. ఒకవేళ 54 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే 21 ఏళ్ల టర్మ్ ఎంచుకోవచ్చు. 50 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే 25 ఏళ్ల టర్మ్ ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ 16 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రీమియం 10 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య చెల్లించాలి.

    IRCTC Tirupati Tour: శ్రీవారి భక్తులకు మరో టూర్ ప్యాకేజీ... ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి ట్రిప్

    పాలసీ హోల్డర్లు ప్రతీ నెల, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి ప్రీమియం చెల్లించొచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తి 25 ఏళ్ల టెన్యూర్‌తో పాలసీ తీసుకొని 16 ఏళ్ల పాటు రోజుకు రూ.252 చొప్పున చెల్లించాలి. మెచ్యూరిటీ సమయంలో రూ.20,00,000 రిటర్న్స్ వస్తాయి. పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే 16 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే 25 ఏళ్ల కవరేజీ లభిస్తుంది.

    భారీ మొత్తంలో సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకోలేని వారు రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్ల వ్యక్తి రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌తో 16 ఏళ్లకు పాలసీ తీసుకుంటే ఏటా రూ.16,699 ప్రీమియం చెల్లిస్తే చాలు. 21 ఏళ్లకు పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. రూ.10,682 ప్రీమియం చెల్లించాలి. ఇక 25 ఏళ్లకు పాలసీ తీసుకుంటే రూ.9,006 ప్రీమియం చెల్లించాలి.

    Save Money: ఈ ప్రభుత్వ పథకంలో రూ.250 చొప్పున పొదుపు చేస్తే అరకోటి రూపాయల పైనే రిటర్న్స్

    పిల్లల పైచదువులు, అమ్మాయిల పెళ్లి, ఇతర ఖర్చులు లాంటి అవసరాలు ఉన్నవారు ఇలాంటి పాలసీ ఎంచుకోవచ్చు. డబ్బు పొదుపు చేయడంతో పాటు జీవిత బీమా ప్రయోజనాలు కూడా ఉంటాయి. కుటుంబ పెద్ద అనుకోని పరిస్థితుల్లో దూరమైతే పాలసీ డబ్బులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: LIC, Personal Finance

    తదుపరి వార్తలు