హోమ్ /వార్తలు /బిజినెస్ /

ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ పొందొచ్చు... LIC Jeevan Labh policy ప్రత్యేకత ఇదే

ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ పొందొచ్చు... LIC Jeevan Labh policy ప్రత్యేకత ఇదే

ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ పొందొచ్చు... LIC Jeevan Labh policy ప్రత్యేకత ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ పొందొచ్చు... LIC Jeevan Labh policy ప్రత్యేకత ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

LIC Jeevan Labh policy | చాలావరకు ఇన్స్యూరెన్స్ పాలసీలు ప్రీమియం ఆపేస్తే బెనిఫిట్స్ ఆగిపోతాయి. కానీ ఎల్ఐసీలో కొన్ని పాలసీల ప్రీమియం ఆపేసిన తర్వాత కూడా బెనిఫిట్స్ పొందొచ్చు. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ కూడా అలాంటిదే.

మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC జీవన్ లాభ్ పేరుతో ఓ పాలసీ అందిస్తోంది. ఇది లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ పాలసీ. అంటే మీరు ప్రీమియం కొంతకాలం చెల్లిస్తే చాలు. ప్రీమియం నిలిపివేసిన తర్వాత కూడా పాలసీ బెనిఫిట్స్ పొందొచ్చు. పాలసీదారులు మెచ్యూరిటీ కన్నా ముందు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా మద్దతు లభిస్తుంది. డెత్ బెనిఫిట్‌తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా వస్తాయి. ఒకవేళ పాలసీ ముగిసేవరకు పాలసీదారులు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ పాలసీని 8 ఏళ్ల వయస్సు పూర్తైనవారు ఎవరైనా తీసుకోవచ్చు. గరిష్ట వయస్సు 59 ఏళ్లు. గరిష్టంగా మెచ్యూరిటీ వయస్సు 75 ఏళ్లు. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీని కనీసం రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌తో తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీతో పాటు ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ ఇన్స్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వేవర్ రైడర్ కలిపి తీసుకోవచ్చు. పాలసీ ప్రీమియంను ఏడాదికి, ఆరు నెలలకు, మూడు నెలలకు, నెలకు ఓసారి చెల్లించొచ్చు.

Gold Loan: ఈ విషయాలు తెలుసుకోకుండా గోల్డ్ లోన్ తీసుకుంటే నష్టపోతారు

EPF Balance: దీపావళి నాటికి ఈపీఎఫ్ వడ్డీ మీ అకౌంట్‌లోకి... చెక్ చేయండి ఇలా

ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీకి సంబంధించిన ఉదాహరణను వెబ్‌సైట్‌లో వివరించింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC . 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌కు 16 ఏళ్లకు పాలసీ తీసుకుంటే ఏడాదికి రూ.16,699 ప్రీమియం చెల్లించాలి. అదే వ్యక్తి 21 ఏళ్లకు పాలసీ తీసుకుంటే రూ.10,682 ప్రీమియం చెల్లించాలి. 25 ఏళ్లకు పాలసీ తీసుకుంటే రూ.9,006 ప్రీమియం చెల్లించాలి. అయితే 16 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 10 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ఆరేళ్లు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. 21 ఏళ్లకు తీసుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఇక 25 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 16 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. అంటే 9 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

ATM: వేలి ముద్రతో ఏటీఎంలో డబ్బులు డ్రా చేయండి ఇలా

శ్రీవారి భక్తులకు గమనిక... అమెజాన్‌లో TTD 2021 క్యాలెండర్లు, డైరీలు... కొనండి ఇలా

ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌కు 25 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 16 ఏళ్ల పాటు ఏడాదికి రూ.9,134 చొప్పున చెల్లించాలి. ఐదేళ్లకు చెల్లించే ప్రీమియం రూ.45,670 అవుతుంది. ఐదేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి రూ.2,00,000 డెత్ బెనిఫిట్+బోనస్ వస్తుంది. 16 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.1,46,144. కానీ 25 ఏళ్ల వరకు పాలసీ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.2,00,000 + రూ.1,70,000 వరకు బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం రూ.3,70,000 వరకు రావొచ్చు.

First published:

Tags: Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు