news18-telugu
Updated: October 27, 2020, 3:31 PM IST
LIC Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెల రూ.19,000 మీ అకౌంట్లోకి
(ప్రతీకాత్మక చిత్రం)
ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. ఎల్ఐసీలో జీవన్ అక్షయ్-7 పేరుతో ఓ పాలసీ ఉంది. ఈ పాలసీ ప్రీమియం ఒక్కసారి కడితే చాలు. ప్రతీ నెల రూ.19,000 మీ అకౌంట్లోకి వస్తాయి. ఇలా జీవితాంతం పొందొచ్చు. సాధారణంగా ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే ప్రతీ నెల లేదా సంవత్సరానికోసారి ప్రీమియం చెల్లించాలి. కానీ సింగిల్ ప్రీమియం పాలసీలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఎల్ఐసీ జీవన్ అక్షయ్-7 పాలసీ ఒకటి. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల రిటర్న్స్ పొందడం ఈ పాలసీ ప్రత్యేకత. ఇటీవలే ఈ పాలసీని పరిచయం చేసింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC. వృద్ధాప్యంలో పెన్షన్ కోరుకునేవారికి, ప్రతీ నెల ఆదాయం కోరుకునేవారికి ఈ పాలసీ మంచి ఆప్షన్. ఎల్ఐసీ జీవన్ అక్షయ్-7 పాలసీని ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇది సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, పర్సనల్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీ తీసుకోవడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు.
LIC new plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ... ఈ ప్లాన్‌తో ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులుLIC Policy: రూ.121 పొదుపు చేస్తే రూ.27 లక్షలు రిటర్న్స్... ఈ పాలసీ మీకు తెలుసా?
ఎల్ఐసీ జీవన్ అక్షయ్ 7 పాలసీలో చేరడానికి కనీస వయస్సు 30 ఏళ్లు. గరిష్ట వయస్సు 85 ఏళ్లు. యాన్యుటీ ఎంచుకోవడానికి 10 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎంచుకునే ఆప్షన్ని బట్టి యాన్యుటీ వస్తుంది. ఏడాదికి కనీసం రూ.12,000 యాన్యుటీ పొందొచ్చు. యాన్యుటీని నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి పొందొచ్చు. ఈ పాలసీ ఎలా పనిచేస్తుందో ఓ ఉదాహరణ చూద్దాం. 32 ఏళ్ల వ్యక్తి ఎల్ఐసీ జీవన్ అక్షయ్ 7 పాలసీ రూ.40,00,000 సమ్ అష్యూర్డ్‌కు పాలసీ తీసుకోవాలంటే ఒకేసారి రూ.40,72,000 ప్రీమియం చెల్లించాలి. నెలకు రూ.19,000, మూడు నెలలకు రూ.57,350, ఆరు నెలలకు రూ.1,15,600, ఏడాదికి రూ.2,34,800 యాన్యుటీ వస్తుంది. ఇలా జీవతకాలమంతా పొందొచ్చు. మొదట చెల్లించే ప్రీమియంను బట్టి యాన్యుటీ మారుతుంది. పాలసీ తీసుకున్నప్పుటే వడ్డీ రేటును లాక్ చేస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి ఈ పాలసీని రూ.5,00,000 ప్రీమియం చెల్లించి తీసుకున్నారనుకుందాం. వడ్డీ రేటు 7 శాతంగా నిర్ణయిస్తే జీవితాంతం అదే వడ్డీ రేటు ఉంటుంది.
SBI Health Policy: ఎస్బీఐ ఆరోగ్య సంజీవని... తక్కువ ధరకే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ
LIC Policy: రోజుకు రూ.28 పొదుపుతో రూ.3.97 లక్షలు రిటర్న్స్
ఎల్ఐసీ జీవన్ అక్షయ్ 7 పాలసీలో కనీసం రూ.1,00,000 సింగిల్ ప్రీమియం చెల్లించాలి. వారికి ఏడాదికి రూ.12,000 యాన్యుటీ వస్తుంది. ఈ పాలసీలో లోన్ సదుపాయం కూడా ఉంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత లేదా ఫ్రీ లుక్ పీరియడ్ ముగిసిన తర్వాత లోన్ తీసుకోవచ్చు. ఇక పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే యాన్యుటీ ఆగిపోతుంది. సమ్ అష్యూర్డ్‌ను నామినీకి ఇస్తారు. ఇక ఈ పాలసీ తీసుకున్నవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీసీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
Published by:
Santhosh Kumar S
First published:
October 27, 2020, 3:31 PM IST