హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓ అలర్ట్... నేడు సెబీ కీలక నిర్ణయం

LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓ అలర్ట్... నేడు సెబీ కీలక నిర్ణయం

LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓ అలర్ట్... నేడు సెబీ కీలక నిర్ణయం
(ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓ అలర్ట్... నేడు సెబీ కీలక నిర్ణయం (ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO Update | ఎల్ఐసీ ఐపీఓ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు అలర్ట్. ఎల్ఐసీ ఐపీఓపై (LIC IPO) సెబీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎల్ఐసీ ఐపీఓ తీసుకురావడానికి మే 12 డెడ్‌లైన్‌గా ఉంది.

భారతదేశంలో అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే మార్చిలోనే ఎల్ఐసీ ఐపీఓ వచ్చేది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఆ తర్వాత మార్కెట్లు పతనం కావడం లాంటి కారణాలతో ఎల్ఐసీ ఐపీఓ వాయిదా పడింది. ఇప్పుడు మార్కెట్లు స్థిరంగా ఉండటంతో ఎల్ఐసీ ఐపీఓ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మరోసారి కసరత్తు మొదలుపెట్టింది. అయితే ముందు ప్రకటించిన ఐపీఓకు, రాబోయే ఐపీఓకు చాలా మార్పులు ఉండబోతున్నాయి.

ఇప్పటికే మార్కెట్స్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దగ్గర ఎల్ఐసీ ఐపీఓకి సంబంధించిన తాజా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టర్ (DRHP) సబ్మిట్ చేసింది ఎల్ఐసీ. సవరించిన డీఆర్‌హెచ్‌పీకి సెబీ సోమవారం ఆమోదం తెలిపే అవకాశం ఉందని CNBC-TV18 కి విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ వారంలోనే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టర్ (RHP) ఫైల్ చేసే ఆలోచనలో ఉంది ఎల్ఐసీ.

Goa Tour: హైదరాబాద్ నుంచి గోవా టూర్... రూ.10,000 లోపే ఐదు రోజుల ట్రిప్

ఎల్ఐసీ ఐపీఓను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మే 12 వరకు మాత్రమే గడువు ఉంది. కాబట్టి అంతలోగానే ఐపీఓ ప్రాసెస్ పూర్తవుతుంది. మే మొదటివారంలోనే ఎల్ఐసీ ఐపీఓ మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎల్ఐసీ ఐపీఓ సుమారు రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఉంటుందని గతంలో అంచనా వేశారు. కానీ ఐపీఓ సైజ్‌ను రూ.21,000 కోట్లకు తగ్గింది. 5 శాతం వాటాలు విక్రయిస్తామని మొదట డ్రాఫ్ట్ పేపర్స్‌లో వెల్లడించింది ప్రభుత్వం.

ఇప్పుడు కేవలం 3.5 శాతం వాటాలను మాత్రమే అమ్మి రూ.21,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ వ్యాల్యుయేషన్ రూ.6 లక్షల కోట్లుగా లెక్కించారు. ఇక ఎల్ఐసీ ఐపీఓలో షేర్ ధర విషయానికి వస్తే ప్రైస్ బ్యాండ్ రూ.950 నుంచి రూ.1,000 మధ్య ఉంటుందని అంచనా. మరోవైపు ఐపీఓలో రూ.9,000 కోట్ల గ్రీన్‌షూ ఆప్షన్ ఉంది. గ్రీన్‌షూ ఆప్షన్ అంటే ఓవర్ అలాట్‌మెంట్ ఆప్షన్. ఒకవేళ సబ్‌స్క్రిప్షన్ ఎక్కువగా వస్తే మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఐపీఓ సైజ్‌ను రూ.9,000 కోట్లు పెంచుకోవచ్చు.

SBI: ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన ఛాన్స్... రూ.9,00,000 ప్రైజ్ మనీ

ఇక ఈ ఐపీఓలో కోటాల విషయానికి వస్తే రీటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్‌కు 50 శాతం చొప్పున కేటాయిస్తారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ కోటాలో 60 శాతం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు ఎల్ఐసీ ఉద్యోగులకు, ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు కోటా కూడా ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. మరి వీరికి కోటా కోసం ఎవరి కోటా తగ్గిస్తారో చూడాలి.

First published:

Tags: IPO, LIC, LIC IPO, Sebi, Stock Market

ఉత్తమ కథలు