LIC IPO SBI Tips | ఎల్ఐసీ ఐపీఓ ఇన్వెస్టర్లకు అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇన్వెస్టర్లకు ముఖ్యమైన టిప్స్ ఇస్తోంది. 5 టిప్స్ పాటించడం ద్వారా ఎల్ఐసీ ఐపీఓ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలను తగ్గించుకోవచ్చని చెబుతోంది.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్స్క్రిప్షన్ కొనసాగుతోంది మే 9 వరకు ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేయొచ్చు. తొలిసారి ఇన్వెస్టర్ల కోసం శనివారం, ఆదివారం కూడా ఐపీఓ సబ్‌స్క్పిప్షన్ ఓపెన్‌గా ఉంచడం విశేషం. రీటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్స్, ఉద్యోగులు ఎల్ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఐపీఓకి అప్లై చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎల్ఐసీ ఐపీఓకి వస్తున్న క్రేజ్, తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇన్వెస్టర్లకు 5 టిప్స్ ఇచ్చింది. ఈ టిప్స్ పాటిస్తే ఎల్ఐసీ ఐపీఓ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయని చెబుతోంది. మరి ఎస్బీఐ చెప్పిన ఆ ఐదు టిప్స్ ఏవో తెలుసుకోండి.
1. ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేసేముందు మీరు అప్లై చేయాలనుకున్న షేర్లకు సరిపడా డబ్బులు మీ అకౌంట్లో ఉన్నాయో లేదో చెక్ చేయండి. అకౌంట్లో సరైన బ్యాలెన్స్ లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
2. అప్లికేషన్ ప్రాసెస్‌లో మీ యూపీఐ ఐడీ, యూపీఐ పిన్ సరిగ్గా ఎంటర్ చేయండి. ఏ చిన్న పొరపాటు చేసినా ఐపీఓ అప్లికేషన్ ప్రాసెస్ కాదు.
3. ఐపీఓ అప్లికేషన్‌లోని పాన్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన పాన్ నెంబర్ ఒకటే అయి ఉండాలి. అంటే మీ బ్యాంక్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. పాన్ నెంబర్ మ్యాచ్ అయితేనే అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది.
4. యూపీఐ ద్వారా అప్లై చేసేవారు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఊరుకుంటే సరిపోదు. మీ యూపీఐ యాప్‌కు వచ్చే ఐపీఓ మ్యాండేట్‌ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఓ మ్యాండేట్ అప్రూవ్ చేయకపోతే మీరు ఐపీఓకి అప్లై చేసినట్టే కాదు.
5. ఇక ఐపీఓకి సంబంధించి మీ ఫోన్‌కు వచ్చే ఎస్ఎంఎస్లు చెక్ చేస్తూ ఉండాలి. ఐపీఓ అప్లికేషన్ ప్రాసెస్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. మీ అప్లికేషన్ సగంలో ఉందో, పూర్తైందో లేదో ఎస్ఎంఎస్లోని వివరాల ద్వారా తెలుసుకోవచ్చు.
— State Bank of India (@TheOfficialSBI) May 7, 2022
ఎస్బీఐ సూచించిన ఈ ఐదు టిప్స్ పాటిస్తే ఎల్ఐసీ ఐపీఓ అప్లికేషన్ సబ్మిట్ చేయడంలో ఉన్న ఇబ్బందులు దాదాపుగా తొలగిపోతాయి. మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. తద్వారా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే కారణాలను తగ్గించుకోవచ్చు. అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ చేసినంత మాత్రానా ఐపీఓలో షేర్లు అలాట్ అవుతాయని అనుకోవద్దు. ఐపీఓ ఎక్కువ రెట్లు సబ్‌స్క్రైబ్ అయితే లాటరీ ద్వారా షేర్లను కేటాయిస్తారు. కాబట్టి అందరికీ ఐపీఓలో షేర్లు దొరకవు. లాటరీలో అలాట్ అయినవారికే లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.