Home /News /business /

LIC IPO SUBSCRIBED NEARLY 3 TIMES KNOW ABOUT ALLOTMENT LISTING DATE AND GREY MARKET PREMIUM SS

LIC IPO: మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఎల్ఐసీ ఐపీఓ... ఆ రోజే లిస్టింగ్

LIC IPO: మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఎల్ఐసీ ఐపీఓ... ఆ రోజే లిస్టింగ్
(ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO: మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఎల్ఐసీ ఐపీఓ... ఆ రోజే లిస్టింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO | ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. చివరి రోజు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఐదు రోజులు వేచిచూచిన ఇన్వెస్టర్లు చివరి రోజు ఎల్ఐసీ ఐపీఓని సబ్‌స్క్రైబ్ చేశారు. సుమారు మూడు రెట్లు ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రైబ్ అయింది.

ఇంకా చదవండి ...
ఇన్వెస్టర్లు ఏడాదిగా ఎదురుచూసిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. చివరిరోజు ఎల్ఐసీ ఐపీఓకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చివరి రోజు పాలసీహోల్డర్ కోటా 6.10 రెట్లు, ఎంప్లాయీ కోటా 4.39 రెట్లు, రీటైల్ కోటా 1.99 రెట్లు, ఎన్ఐఐ కోటా 2.91 రెట్లు, క్యూఐబీ కోటా 2.83 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తంగా చూస్తే ఎల్ఐసీ ఐపీఓ 2.95 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. ఆరు రోజుల పాటు ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) సబ్‌స్క్రిప్షన్ కొనసాగింది. చరిత్రలో తొలిసారి శనివారం, ఆదివారం కూడా ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉండటం విశేషం. ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగియడంతో ఇక ఇన్వెస్టర్ల చూపులన్నీ లిస్టింగ్ పైనే ఉన్నాయి.

ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ సుమారు మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ కావడంతో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న మొత్తాన్ని సమీకరించడం సాధ్యమే. ఎల్ఐసీ ఐపీఓ ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడంతో ఇన్వెస్టర్లకు లాటరీ ద్వారా షేర్లను కేటాయిస్తారు. పాలసీహోల్డర్ కోటాలోనే పోటీ ఎక్కువగా ఉంది. పాలసీహోల్డర్ కోటా 6.10 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

Aadhaar Card: ఆధార్ కార్డ్ ఒరిజినలేనా? వెరిఫై చేయడానికి అనేక మార్గాలు

ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేసినవారికి షేర్ల అలాట్‌మెంట్ మే 16న జరుగుతుంది. ఎల్ఐసీ ఐపీఓ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో మే 17న లిస్ట్ అవుతుంది. అప్పటివరకు గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత వస్తుందన్న సస్పెన్స్ కూడా ఉంది. ఎల్ఐసీ గ్రే మార్కెట్ ప్రీమియం ఓ దశలో రూ.85 వరకు వెళ్లింది. కానీ ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం రూ.36 కి చేరుకుంది. మరి మే 17 వరకు గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంటుందో చూడాలి.

మార్కెట్ పరిస్థితులను బట్టి గ్రే మార్కెట్ ప్రీమియం పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మార్కెట్ సెంటిమెంట్‌ను బట్టి గ్రే మార్కెట్ ప్రీమియం ఉంటుంది. అయితే ఎల్ఐసీ ఐపీఓ కనీసం 10 శాతం నుంచి 12 శాతం మధ్య ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అంచనా. అదే జరిగితే ఒక షేర్‌కు రూ.94 లాభం దక్కొచ్చు.

SBI Offers: కొత్త కార్ కొనాలనుకునేవారికి ఎస్‌బీఐ ఆఫర్స్... రూ.25,000 వరకు బెనిఫిట్స్

ఎల్ఐసీ ఐపీఓ భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓ కావడం విశేషం. ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన భారీ ఐపీఓల్లో రూ.18,300 కోట్లతో పేటీఎం, రూ.15,199 కోట్లతో కోల్ ఇండియా, రూ.11,563 కోట్లతో రిలయన్స్ పవర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎల్ఐసీ సంస్థలో 3.5 శాతం వాటాలు అమ్మడం ద్వారా సుమారు రూ.21,000 కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Investments, IPO, LIC, LIC IPO, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు