Home /News /business /

LIC IPO SHARE ALLOTMENT ONLINE KNOW HOW INVESTORS CAN CHECK SUBSCRIPTION STATUS ON KFINTECH WEBSITE AND BSE OFFICIAL WEBSITE SS

LIC IPO Allotment: ఎల్ఐసీ ఐపీఓ అలాట్‌మెంట్ పూర్తి... సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ చెక్ చేయండిలా

LIC IPO Allotment: ఎల్ఐసీ ఐపీఓ అలాట్‌మెంట్ పూర్తి... సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ చెక్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO Allotment: ఎల్ఐసీ ఐపీఓ అలాట్‌మెంట్ పూర్తి... సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ చెక్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO Allotment | ఎల్ఐసీ ఐపీఓ ఇన్వెస్టర్ల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. షేర్ల అలాట్‌మెంట్ (LIC Shares Allotment) పూర్తైంది. షేర్లు వచ్చినవారంతా లిస్టింగ్ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. షేర్లు అలాట్ కానివారికి రీఫండ్ వస్తోంది.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ అలాట్‌మెంట్ పూర్తైంది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మే 9న ముగిసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు అలాట్‌మెంట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. చివరకు ఎల్ఐసీ ఐపీఓ అప్లై చేసినవారికి అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తైంది. ఎల్ఐసీ ఐపీఓ ఇన్వెస్టర్లు బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ అధికారిక వెబ్‌సైట్ లేదా రిజిస్ట్రార్ అయిన KFin Technologies Limited వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్ స్టేటస్ చెక్ చేయొచ్చు. ఎల్ఐసీ షేర్లు అలాట్ అయినవారికి బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు డెబిట్ అయినట్టు మెసేజెస్ వస్తున్నాయి. ఈ మెసేజ్ వస్తే షేర్లు అలాట్ అయ్యాయని అర్థం చేసుకోవచ్చు. మరి బీఎస్ఈ వెబ్‌సైట్‌లో ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

Step 1- ముందుగా బీఎస్ఈ వెబ్‌సైట్ https://www.bseindia.com/investors/appli_check.aspx ఓపెన్ చేయాలి.

Step 2- ఆ తర్వాత equity సెలెక్ట్ చేయాలి.

Step 3- ఆ తర్వాత ఎల్ఐసీ సెలెక్ట్ చేయాలి.

Step 4- అప్లికేషన్ నెంబర్ లేదా పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 5- సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ తెలుస్తుంది.

IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... టికెట్ బుకింగ్ ప్రాసెస్ మారింది

ఎల్ఐసీ ఐపీఓ రిజిస్ట్రార్ అయిన KFin Technologies Limited వెబ్‌సైట్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ చెక్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో కావాలి.

Step 1- ఇన్వెస్టర్లు https://ris.kfintech.com/ipostatus/ipos.aspx ఓపెన్ చేయాలి.

Step 2- ఎల్ఐసీ ఐపీఓ సెలెక్ట్ చేయాలి.

Step 3- ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ లేదా పాన్ నెంబర్ లేదా క్లైంట్ ఐడీ ఎంటర్ చేయాలి.

Step 4- సెర్చ్ చేస్తే ఎల్ఐసీ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ తెలుస్తుంది.

ఇన్వెస్టర్లు కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో సులువుగా ఐపీఓ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఐపీఓలో షేర్లు అలాట్ అయినవారికి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. మిగతావారికి రీఫండ్ వస్తుంది. షేర్లు అలాట్ అయినవారికి మే 16న షేర్లు డీమ్యాట్ అకౌంట్‌లోకి వస్తాయి. ఎల్ఐసీ ఐపీఓ మే 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతుంది.

Old Currency Notes: మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఆర్‌బీఐ సూచనలు ఇవే

ఎల్ఐసీ షేర్ల గ్రే మార్కెట్ ప్రీమియం దారుణంగా పడిపోయింది. ఓ దశలో రూ.92 వరకు ప్రీమియం లభిస్తుందని వార్తలొచ్చాయి. కానీ మార్కెట్ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం పడిపోయింది. ఎల్ఐసీ షేర్లు రూ.26 డిస్కౌంట్‌తో లిస్ట్ అవుతాయని ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం ట్రెండ్‌ను బట్టి తెలుస్తోంది. ప్రస్తుత అంచనాలను బట్టి ఎల్ఐసీ షేర్లు రూ.923 ధర దగ్గర లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. లిస్టింగ్ రోజు నాటికి గ్రే మార్కెట్ ప్రీమియం ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Investments, IPO, LIC, LIC IPO, Personal Finance, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు