హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC IPO: రికార్డులు తిర‌గ‌రాస్తున్న ఎల్ఐసీ.. దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ

LIC IPO: రికార్డులు తిర‌గ‌రాస్తున్న ఎల్ఐసీ.. దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ అలాట్‌మెంట్ పూర్తైంది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మే 9న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ నెల 17న(మంగళవారం) ఎల్‌ఐసీ స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్ట్‌కానుంది. దీంతో దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా ఎల్‌ఐసీ రికార్డు సృష్టించింది.

ఇంకా చదవండి ...

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ అలాట్‌మెంట్ పూర్తైంది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మే 9న ముగిసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు అలాట్‌మెంట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. చివరకు ఎల్ఐసీ ఐపీఓ అప్లై చేసినవారికి అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తైంది. ఎల్ఐసీ ఐపీఓ ఇన్వెస్టర్లు బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ అధికారిక వెబ్‌సైట్ లేదా రిజిస్ట్రార్ అయిన KFin Technologies Limited వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్ స్టేటస్ చెక్ చేయొచ్చు  అయితే ఈ క్ర‌మంలోనే ఈ నెల 17న(మంగళవారం) ఎల్‌ఐసీ స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్ట్‌కానుంది. దీంతో దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా ఎల్‌ఐసీ రికార్డు సృష్టించింది. ఫలితంగా ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించడం ద్వారా రికార్డు నెలకొల్పిన పేటీఎమ్‌ రెండో ర్యాంకుకు చేరింది.

Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొంటున్నారా.. అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోండి


ఇక 2010లో రూ. 15,500 కోట్ల విలువైన ఐపీవో చేపట్టిన కోల్‌ ఇండియా, 2008లో రూ. 11,700 కోట్ల ఇష్యూకి వచ్చిన రిలయన్స్‌ పవర్‌ తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. ఎల్ఐసీ ప‌బ్లిక్ ఇష్యూ సంద‌ర్భంగా ధరల శ్రేణిలో తుది ధర రూ. 949ను ఖరారు చేసింది. అయితే పాలసీదారులకు రూ. 60 డిస్కౌంట్‌పోను రూ. 889కే షేర్లను జారీ చేసింది. ఈ బాటలో ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ. 904 ధర(రూ. 45 రాయితీ)లో షేర్లను కేటాయించారు.

LIC IPO Allotment: ఎల్ఐసీ ఐపీఓ అలాట్‌మెంట్ పూర్తి... సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ చెక్ చేయండిలా

ఇతరులకు రూ. 949 ధరలో షేర్ల జారీని చేపట్టింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించింది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది.

Salary Hike: ఈ ఏడాది వేత‌నాల పెరుగుద‌ల‌లో మార్పులు.. ఎక్క‌డ అధికం.. ఎంత పెర‌గొచ్చు.. స‌ర్వే వివ‌రాలు


ఎల్ఐసీ ప‌బ్లిక్ ఇష్యూ సంద‌ర్భంగా ధరల శ్రేణిలో తుది ధర రూ. 949ను ఖరారు చేసింది. అయితే పాలసీదారులకు రూ. 60 డిస్కౌంట్‌పోను రూ. 889కే షేర్లను జారీ చేసింది. ఈ బాటలో ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ. 904 ధర(రూ. 45 రాయితీ)లో షేర్లను కేటాయించగా.. ఇతరులకు రూ. 949 ధరలో షేర్ల జారీని చేపట్టింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించింది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది.

First published:

Tags: IPO, LIC IPO

ఉత్తమ కథలు