భారతదేశంలో అతిపెద్ద ఐపీఓకి రంగం సిద్ధమైంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ మే మొదటివారంలో మార్కెట్లోకి రాబోతోంది. ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ (LIC IPO Subscription) మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది. యాంకర్ బుక్ మే 2న ప్రారంభం అవుతుంది. ఇక ఎల్ఐసీ ఐపీఓలో పాలసీహోల్డర్స్‌కు, రీటైల్ ఇన్వెస్టర్లకు, ఎల్ఐసీ ఉద్యోగులకు భారీ డిస్కౌంట్ లభించనుంది. ఎల్ఐసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ చూస్తే రూ.902 నుంచి రూ.949 మధ్య ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు రూ.60, రీటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్ లభించనుంది. ఈ డిస్కౌంట్‌తో ఎల్ఐసీ పాలసీహోల్డర్లు రూ.842 నుంచి రూ.889 మధ్య, రీటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులు రూ.857 నుంచి రూ.904 మధ్య ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేయొచ్చు. ఈ డిస్కౌంట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఎల్ఐసీ ఐపీఓలో పాలసీహోల్డర్లకు 10 శాతం కోటా ప్రత్యేకంగా కేటాయించడం విశేషం. ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా అంతే మొత్తంలో కోటా లభించనుంది. రీటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా లభిస్తుంది. 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు 50 శాతం కోటా ఉంటుంది. అందులో 60 శాతం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. ఒక లాట్‌లో 15 షేర్లకు అప్లై చేయొచ్చు. రీటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్లు అప్లై చేయొచ్చు.
Post Office: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఉన్నారా? ఈ కొత్త రూల్ తెలుసా?
ఎల్ఐసీ ఐపీఓ సైజ్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటాలు అమ్మడం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఈ లెక్కన ఎల్ఐసీ వ్యాల్యుయేషన్ రూ.5.4 లక్షల కోట్లుగా లెక్కించారు. వాస్తవానికి ప్రభుత్వం 5 శాతం వాటాలు అమ్మాలని నిర్ణయించింది. కానీ రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. దీంతో ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీఓ సైజ్‌ను తగ్గించాయి.
ఎల్ఐసీ ఐపీఓ మార్చిలోనే రావాల్సి ఉండగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఐపీఓ వాయిదా పడింది. మే 12 నాటికి ఐపీఓ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో మే మొదటివారంలో ఎల్ఐసీ ఐపీఓ తీసుకొచ్చేలా షెడ్యూల్ నిర్ణయించారు. మే 17న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఎన్ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్ట్ అయ్యే అవకాశముంది. ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ఒక షేర్‌కి రూ.48 ప్రీమియం లభిస్తోంది.
Investment: రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.11 లక్షల రిటర్న్స్
ఎల్ఐసీలో 30 కోట్లకు పైగా పాలసీహోల్డర్లు ఉన్నారు. ఇన్స్యూరెన్స్ రంగంలో ఎల్ఐసీ మార్కెట్ షేర్ ఎక్కువ. పాలసీల విషయంలో 71 శాతం, న్యూ బిజినెస్ ప్రీమియంలో 61 శాతం ఎల్ఐసీదే కావడం విశేషం. ఎల్ఐసీ గురించి పరిచయం అక్కర్లేదు. భారతదేశంలో ప్రతీ కుటుంబానికి ఎల్ఐసీ సుపరిచితమే. వేర్వేరు కస్టమర్లకు ఇన్స్యూరెన్స్ ప్లాన్స్, మనీబ్యాక్ స్కీమ్స్ అందిస్తోంది ఎల్ఐసీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Investments, IPO, LIC, LIC IPO, Personal Finance