హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓపై అధికారిక ప్రకటన వచ్చేసింది... ప్రైస్ బ్యాండ్, డిస్కౌంట్ వివరాలివే

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓపై అధికారిక ప్రకటన వచ్చేసింది... ప్రైస్ బ్యాండ్, డిస్కౌంట్ వివరాలివే

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓపై అధికారిక ప్రకటన వచ్చేసింది... ప్రైస్ బ్యాండ్, డిస్కౌంట్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓపై అధికారిక ప్రకటన వచ్చేసింది... ప్రైస్ బ్యాండ్, డిస్కౌంట్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO News | ఎల్ఐసీ ఐపీఓపై అధికారిక ప్రకటన వచ్చేసింది. దాదాపు ఏడాదిగా ఊరిస్తున్న ఎల్ఐసీ ఐపీఓను (LIC IPO) దీపం సెక్రెటరీ తుహిన్ కాంతా పాండే అధికారికంగా ప్రకటించారు. ఐపీఓ సైజ్, ఐపీఓ తేదీలు, ప్రైస్ బ్యాండ్ వివరాలను వెల్లడించారు.

ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌పై (IPO) అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ (LIC IPO Subscription) మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుందని దీపం సెక్రెటరీ తుహిన్ కాంతా పాండే తెలిపారు. ఐపీఓ సైజ్ తగ్గించిన తర్వాత కూడా ఇదే అతిపెద్ద ఐపీఓ అని తెలిపారు. ప్రస్తుత క్యాపిటల్ మార్కెట్ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే సరైన పరిమాణంలో ఎల్ఐసీ ఐపీఓ ఉందని, ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో పెట్టుబడి విలువను పెంచుతుందని ఆయన అన్నారు. ఎల్ఐసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ.902 నుంచి రూ.949 మధ్య ఫిక్స్ చేసినట్టు వివరించింది. ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ.20,557 కోట్లు సమీకరించనుంది ప్రభుత్వం. ఎల్ఐసీ ఐపీఓకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఎల్ఐసీ ఐపీఓ ఎప్పుడు?


ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మే 4 నుంచి మే 9 వరకు

ఎల్ఐసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఎంత?


ఒక షేర్‌కి రూ.902 నుంచి రూ.949

Post Office: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఉన్నారా? ఈ కొత్త రూల్ తెలుసా?

పాలసీహోల్డర్లకు డిస్కౌంట్ ఎంత?


ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు రూ.60 డిస్కౌంట్ లభించనుంది. ఈ డిస్కౌంట్‌తో ఎల్ఐసీ పాలసీహోల్డర్లు రూ.842 నుంచి రూ.889 మధ్య షేర్లకు అప్లై చేయొచ్చు.

రీటైల్ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు డిస్కౌంట్ ఎంత?


రీటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్ లభించనుంది. రీటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులు రూ.857 నుంచి రూ.902 మధ్య ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేయొచ్చు.

ఎల్ఐసీ ఐపీఓ సైజ్ ఎంత?


రూ.20,557 కోట్లు

ఎల్ఐసీ ఐపీఓ కోటా వివరాలేంటీ?


పాలసీహోల్డర్లకు 10 శాతం, ఎల్ఐసీ ఉద్యోగులకు 10 శాతం, రీటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు 50 శాతం. క్యూఐబీ కోటాలో యాంకర్ ఇన్వెస్టర్లకు 60 శాతం.

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే

యాంకర్ సబ్‌స్క్రిప్షన్ ఎప్పుడు?


మే 2న యాంకర్ బుక్ ప్రారంభం

ఎన్ని షేర్లు కొనచ్చు?


ఒక లాట్‌లో 15 షేర్లకు అప్లై చేయొచ్చు. రీటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్లు అప్లై చేయొచ్చు.

ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత?


ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ఒక షేర్‌కి రూ.48 ప్రీమియం లభిస్తోంది.

ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్ ఎప్పుడు?


మే 17న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఎన్ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్ట్ అవుతుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Investments, IPO, LIC, LIC IPO, Personal Finance

ఉత్తమ కథలు