LIC IPO: ఎల్ఐసీ ఐపీఓపై పాలసీహోల్డర్లకు క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓపై పాలసీహోల్డర్లకు క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

LIC IPO News | ఎల్ఐసీ ప్రైవేట్‌పరం అవుతుందని, ప్రజల డబ్బుకు బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపైనా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

  • Share this:
    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్-IPO త్వరలో రానున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ఎల్ఐసీ ఐపీఓ వస్తుందని ఫైనాన్స్ సెక్రెటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. అంటే ఎల్ఐసీ ఐపీఓ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఐపీఓ ప్రక్రియలో అనేక దశలు దాటాల్సి ఉంది. "లిస్టింగ్ కోసం అనేక ప్రక్రియలున్నాయి. న్యాయ శాఖతో సంప్రదించి చట్టసవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం" అని ఫైనాన్స్ సెక్రెటరీ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం 10 శాతం వాటాల్ని అమ్మే అవకాశముందని అన్నారాయన. అయితే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

    ఎల్ఐసీ ఐపీఓ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఎల్ఐసీలో ప్రభుత్వం పెట్టుబడుల్ని తగ్గించుకుంటుందన్న వార్తలతో ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గర్నుంచి పాలసీహోల్డర్ల వరకు అందరిలో అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఎల్ఐసీ ప్రైవేట్‌పరం అవుతుందని, ప్రజల డబ్బుకు బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపైనా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎల్ఐసీలో ప్రజల డబ్బుకు సావరిన్ గ్యారెంటీ అంటే సార్వభౌమ హామీ కేంద్ర ప్రభుత్వానిదేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేవలం ఐపీఓ మాత్రమే వస్తోందని, యాజమాన్య హక్కులు ఎవరికీ ఇవ్వట్లేదని అన్నారు.

    ప్రస్తుతం ఎల్ఐసీలో 100 శాతం కేంద్ర ప్రభుత్వానిదే వాటా. ఐడీబీఐ బ్యాంకులో 46.5 వాటాలున్నాయి. ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ.90,000 కోట్లు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐడీబీఐ బ్యాంకులో వాటాలు తగ్గించుకోవడం ద్వారా మరో రూ.2.10 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకొంది. చాలామంది ఈ దశాబ్దంలో అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ గురించి చెబుతున్నారు. సౌదీ ఆరామ్‌కో లిస్టింగ్‌ను తలపిస్తుందని భావిస్తున్నారు. 60 ఏళ్ల చరిత్రగల ఎల్ఐసీకి 70 శాతం మార్కెట్ షేర్ ఉంది.

    ఇవి కూడా చదవండి:

    PMVVY Scheme: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ మార్చి వరకే... త్వరపడండి

    Home Loan: హోమ్ లోన్ తీసుకునేవారికి రూ.3.5 లక్షల బెనిఫిట్స్

    Debit Card: మీ ఫోన్‌ లాగా ఏటీఎం కార్డును స్విచ్చాఫ్ చేయొచ్చు ఇలా
    Published by:Santhosh Kumar S
    First published: