LIC IPO JOSH IN THE MARKET LIC IPO WHICH IS NOT GOING TO START NEXT WEEK GRAY MARKET PREMIUM RISING GH EVK
LIC IPO: మార్కెట్లో జోష్.. వచ్చే వారం ప్రారంభంకానున్న ఎల్ఐసీ ఐపీవో.. పెరుగుతున్న గ్రే మార్కెట్ ప్రీమియం
(ప్రతీకాత్మక చిత్రం)
ఎల్ఐసీ షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.902- రూ.949గా నిర్ణయించారు. ఆఫర్-ఫర్-సేల్ (OFS) మార్గంలో జరిగే ఈ ఐపీవోలో కేంద్ర ప్రభుత్వం 22.13 కోట్ల షేర్లను విక్రయించనుంది. బీమా సంస్థలో తన 3.5 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని చూస్తోంది.
దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). వచ్చే వారంలో ఐపీవో(IPO) ద్వారా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు వచ్చిన అన్నీ ఐపీవోలలో ఎల్ఐసీనే అతిపెద్దది కావడం గమనార్హం. చాలా నెలల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఎల్ఐసీ ఐపీవోకి మార్గం ఖరారైంది. మే 4వ తేదీన బుధవారం ఎల్ఐసీ ఐపీవో ప్రారంభమవుతుంది. మే 9వరకు అప్లై చేసుకొనే అవకాశం ఉంటుంది. ఎల్ఐసీ షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.902- రూ.949గా నిర్ణయించారు.
ఆఫర్-ఫర్-సేల్ (OFS) మార్గంలో జరిగే ఈ ఐపీవోలో కేంద్ర ప్రభుత్వం 22.13 కోట్ల షేర్లను విక్రయించనుంది. బీమా సంస్థలో తన 3.5 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని చూస్తోంది. తొలుత ఫిబ్రవరిలో ప్రభుత్వం కంపెనీలో 5 శాతం వాటాను విక్రయించాలని భావించింది. ఆ తర్వాత 3.5 శాతం ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకొంది. పరిమాణం తగ్గిన తర్వాత కూడా LIC IPO దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ (Public Issue) అవుతుంది.
మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. నేడు గ్రే మార్కెట్లో ఎల్ఐసీ (LIC) షేర్లు రూ.70 ప్రీమియం (జీఎంపీ) వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇది నిన్న రూ.50గా ఉండటం గమనార్హం. బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాలకు షేర్ల కేటాయింపు మే 16 నాటికి జరుగుతుంది. కంపెనీ షేర్లు 2022 మే 17 మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSEలలో లిస్ట్ అవుతాయని భావిస్తున్నారు.
ప్రారంభ వాటా విక్రయంలో రిటైల్ పెట్టుబడిదారులు, అర్హులైన ఉద్యోగులు ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.45 తగ్గింపును పొందుతారు. పాలసీదారులు ఈక్విటీ షేరుపై రూ.60 తగ్గింపు పొందుతారు. అదే విధంగా IPOలో పాలసీదారులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. 15.8 మిలియన్ షేర్లు ఎల్ఐసీ ఉద్యోగులకు, 22.1 మిలియన్ షేర్లు ఎల్ఐసీ పాలసీదారులకు రిజర్వ్ చేశారు.
ఇష్యూ పరిమాణంలో సగం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కోసం, 35 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కు కేటాయించారు. కనిష్టంగా 15 ఈక్విటీ షేర్ల కోసం బిడ్ వేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ అప్లై చేయాలనుకొంటే 15 మల్టిపుల్స్‌లో బిడ్లు వేయవచ్చు. ప్రైస్ బ్యాండ్ హైయర్ వాల్యూ ఆధారంగా ప్రభుత్వం దాదాపు రూ.21,000 కోట్లను సమీకరించనుంది.
DIPAM సెక్రటరీ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. ‘మార్కెట్ మూలధన ప్రవాహం బయటకు రాకుండా ఎల్ఐసీ వాటా విక్రయాన్ని "రైట్-సైజ్"కి తగ్గించాం. ఈ ఇష్యూ అందరికీ ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులకు విలువను పెంచుతుంది.’ అని చెప్పారు. నార్వే, సింగపూర్, అబుదాబికి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్లు మెగా ఇష్యూలో యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉండటానికి కట్టుబడి ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ వర్గాలు తెలిపాయి. నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, జీఐసీ పీటీఐ, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సోమవారం ప్రకటించబోయే యాంకర్ పేర్లలో ఉన్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.