Home /News /business /

LIC IPO IN EARLY MAY CENTER LIKELY TO SELL MORE THAN 5 PERCENT STAKE IN THE COMPANY GH VB

LIC IPO: ఆ నెల ప్రారంభంలో ఎల్ఐసీ ఐపీఓ.. కేంద్రం ఎంత శాతం అమ్మే అవకాశం ఉందో తెలుసా..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌ (IPO) లాంచింగ్ ఎప్పుడెప్పుడా అని ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పబ్లిక్ ఇష్యూ (Public Issue) లేదా ఐపీఓను మే నెల ప్రారంభంలో ప్రభుత్వం లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌ (IPO) లాంచింగ్ ఎప్పుడెప్పుడా అని ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పబ్లిక్ ఇష్యూ (Public Issue) లేదా ఐపీఓను మే నెల ప్రారంభంలో ప్రభుత్వం లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, పబ్లిక్ ఆఫర్ (Public Offer) ద్వారా 5 శాతం కంటే ఎక్కువ వాటా (Stake)ను ప్రభుత్వం సేల్ చేయవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కోసం కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ (red-herring prospectus)ను ఫైనలైజ్ చేసేందుకు బ్యాంకర్లు, సలహాదారులతో సంప్రదింపులు జరుపుతోందని సోర్సెస్ వెల్లడిస్తున్నాయి.

ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ అయిన సెబీ నుంచి ఇనిషియల్ షేర్ సేల్ ద్వారా నిధులను సేకరించేందుకు అనుమతి పొందింది. సెబీకి దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం, ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెందిన 31 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తుంది. అందులో కొంత భాగాన్ని యాంకర్ ఇన్వెస్టర్ల (Anchor Investors) కోసం రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఐపీఓ ఇష్యూ సైజులో 10 శాతం వరకు పాలసీదారులకు, 35 శాతం వరకు రిటైల్ పెట్టుబడిదారులకు రిజర్వ్ చేస్తారు. ఈ ఐపీఓ పూర్తిగా ప్రభుత్వం అందించే ఆఫర్ ఫర్ సేల్ (OFS) కాగా ఎల్ఐసీ (LIC) ద్వారా ఎలాంటి తాజా షేర్ల జారీ అవ్వవు. ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటా లేదా 632.49 కోట్ల షేర్లు ఉన్నాయి.

విశ్వసనీయ వర్గాల ప్రకారం, సెబీకి ఫ్రెష్ పేపర్స్ ఫైల్ చేయకుండా ఎల్‌ఐసీ ఐపీఓను ప్రారంభించడానికి ప్రభుత్వానికి మే 12 వరకు సమయం ఉంది. “సెబీకి ఫైల్ చేసిన పేపర్స్ ఆధారంగా ఐపీఓని ప్రారంభించేందుకు మే 12 వరకు మాకు విండో ఉంది. మేం మార్కెట్ వోలటీలిటీ (Volatility)ని నిశితంగా గమనిస్తున్నాం. ప్రైస్ బ్యాండ్‌ను అందించే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌(RHP)ని త్వరలో ఫైల్ చేస్తాం" అని ఒక అధికారి మీడియాకు వెల్లడించారు.

Petrol Diesel Prices: రూ.123 దాటిన లీటర్ పెట్రోల్ ధర.. దేశంలోనే అత్యధిక రేటు అక్కడే

ఎల్ఐసీ డీఆర్‌హెచ్‌పీ (DHRP) ఫిబ్రవరి 13న దాఖలు అయింది. ఐదు శాతం వాటా తగ్గింపుతో, ఎల్ఐసీ ఐపీఓ భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్దదిగా ఉంటుంది. ఒకసారి లిస్ట్ చేస్తే, ఎల్ఐసీ మార్కెట్ విలువను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి అగ్ర కంపెనీలతో పోల్చవచ్చు (TCS). అంతర్జాతీయ యాక్చురియల్ సంస్థ మిల్లిమాన్ అడ్వైజర్స్ ప్రకారం, సెప్టెంబరు 30, 2021 నాటికి బీమా కంపెనీలో ఏకీకృత వాటాదారుల విలువ దాదాపు రూ.5.4 లక్షల కోట్లుగా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.78,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ (disinvestment) లక్ష్యాన్ని చేరుకోవడానికి, జీవిత బీమా సంస్థలో ఐదు శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.63,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. బీమా సంస్థ వెబ్‌సైట్ ప్రకారం, ఎల్ఐసీ పన్ను తర్వాత లాభం డిసెంబర్ 2021 త్రైమాసికంలో రూ. 0.91 కోట్ల నుంచి రూ. 234.91 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 2021తో ముగిసిన తొమ్మిది నెలల లాభం కూడా అంతకు ముందు ఏడాది రూ.7.08 కోట్ల నుంచి రూ.1,642.78 కోట్లకు పెరిగింది.
Published by:Veera Babu
First published:

Tags: LIC, LIC IPO

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు