LIC IPO CLARITY ON LIC SHARE SALE CHANCE OF A PUBLIC ISSUE IN THE FIRST WEEK OF MAY EVK
LIC IPO: ఎల్ఐసీ వాటా విక్రయంపై స్పష్టత.. పబ్లిక్ ఇష్యూ ఎప్పుడంటే?
(ప్రతీకాత్మక చిత్రం)
LIC IPO | ఐపీవో ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయిస్తుందని, మే నెల తొలివారంలో మార్కెట్లో ఆఫర్ జారీ అవుతుందని మార్కెట్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఐపీవో ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయిస్తుందని, మే నెల తొలివారంలో మార్కెట్లో ఆఫర్ జారీ అవుతుందని మార్కెట్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే మరింత ఆసక్తికరంగా పబ్లిక్ ఇష్యూ పరిమాణాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించే యోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది. రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూపై ఫండ్ మేనేజర్ల ఆసక్తి తగ్గిపోయినందున ఎల్ఐసీ ఐపీఓను వాయిదా వేశారు. అయితే ఈ పబ్లిక్ ఆఫరింగ్ కోసం ప్రభుత్వానికి మే 12 వరకు గడువు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
గత ఫిబ్రవరిలో సెబీకి ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) ప్రభుత్వం విక్రయించనున్నట్టు తెలిపింది. తాజాగా దానిని 3.5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు శనివారం ఎల్ఐసీ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఇన్వెస్టర్ల స్పందనను అనుసరించి సంస్థ విలువను రూ. 6 లక్షల కోట్లుగా ఖరారు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తలెత్తడంతో ఎల్ఐసీ ఆఫర్ పరిమాణాన్ని, విలువను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఎల్ఐసీ లాభం అనేక రెట్లు పెరిగింది. మొత్తం ప్రీమియంలో కొంత పెరుగుదల కనిపించింది. ఎల్ఐసీ ఇచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ లాభం రూ. 234.9 కోట్లుగా ఉంది. వ్యక్తిగత పాలసీల విభాగంలో ఎల్ఐసీ టాప్‌లో ఉంది. ఈ కేటగిరీలో ఎల్ ఐసీ సంస్థకు 74.6 శాతం మార్కెట్ వాటా ఉంది. అంటే దేశంలో అమ్ముడవుతున్న ప్రతి పది కొత్త బీమా పాలసీల్లో ఏడు ఎల్ఐసీకి చెందినవేనని ఒక నివేదిక చెబుతోంది.
2022 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యమైన రూ.1.75 లక్షల కోట్లను రూ.78 వేల కోట్లకు తగ్గించారు. ఐదు శాతం వాటాలను విక్రయించడం ద్వా రా రూ.65,000 కోట్లు సమీకరించాలని ముందు అనుకున్న విషయం తెలిసిందే. కానీ, దాన్ని రూ.21,000 కోట్లకే పరిమితం చేయాలని ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
భారతీయ మార్కెట్లో ఐపీఓ గ్రీన్‌షూ ఆప్షన్ వినియోగిం చడం ఇదే తొలిసారి. ఐపీఓ గ్రీన్‌షూ ఆప్షన్ అంటే ఎల్ఐసీ ముం దుగానే మరిన్ని అదనపు షేర్ల జారీకి సెబీ నుంచి అనుమతి తీసుకుంటుంది. ఒకవేళ మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉండి, సబ్స్క్రి ప్షన్ ఊహించిన దానికంటే మించితే.. ఆ అదనపు షేర్లను కేటాయిస్తారు. అలా ఎల్ఐసీ మరో రూ.9,000 కోట్లు విలువ చేసే షేర్లను ఐపీఓ సబ్స్క్రి ప్షన్ గడువు ముగిసిన తర్వా త కూడా మదుపర్లకు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.