హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు 6.48 కోట్ల మంది పాలసీదారుల ఆసక్తి..వెల్లడించిన DIPAM డైరెక్టర్..

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు 6.48 కోట్ల మంది పాలసీదారుల ఆసక్తి..వెల్లడించిన DIPAM డైరెక్టర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎల్‌ఐసీ ఈక్విటీ షేర్ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.902- రూ.949గా నిర్ణయించారు. ఎల్‌ఐసీ కంపెనీలోని కొంత వాటాను విక్రయించడం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా IPOలో పాలసీదారులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

ఇంకా చదవండి ...

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో(Stock Exchange) లిస్ట్‌ కానుందనే సమాచారం వెలువడినప్పటి నుంచి అన్ని వర్గాలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కరోనా(Corona) కాలంలో ఎల్‌ఐసీ ఐపీవో(LIC IPO) ఆలస్యమైంది. అనంతరం ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం(Ukraine - Russia War) మొదలవడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్‌(Stock Market) సూచీలు తీవ్ర ఒడుదొడుకలను ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో ఎల్‌ఐసీ ఐపీవోను (LIC IPO) తీసుకురావడం సరైన నిర్ణయం కాదని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఎట్టకేలకు ఎల్‌ఐసీ ఐపీవో(LIC IPO) వివరాలను వెల్లడించారు. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్‌ల(Investors)కు మంచి లిస్టింగ్‌ గెయిన్స్‌ కూడా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా దాదాపు 6.48 కోట్ల మంది ఎల్‌ఐసీ పాలసీ హోల్డర్లు(Policy Holders) దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ షేర్స్ పొందడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని ఒక అధికారి తెలిపారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) డైరెక్టర్‌ రాహుల్ జైన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ IPOకి లభిస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. డిమాండ్‌ ఎంత ఉందో చెప్పడానికి మా వద్ద కొన్ని గణాంకాలు ఉన్నాయి. దాదాపు 6.48 కోట్ల మంది పాలసీదారులు తమ పాన్ నంబర్‌ను కటాఫ్ తేదీ (ఫిబ్రవరి 28, 2022)లోపు పాలసీ వివరాలతో లింక్ చేశారు.’ అని చెప్పారు. ఎల్‌ఐసీ ఈక్విటీ షేర్ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.902- రూ.949గా నిర్ణయించారు. ఎల్‌ఐసీ కంపెనీలోని కొంత వాటాను విక్రయించడం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా IPOలో పాలసీదారులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

Amazon: ఇక అమెజాన్‌లో మ‌రింత ఎంట‌ర్‌టైన్మెంట్‌.. త్వ‌ర‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్

ఐపీవోపై DIPAM డైరెక్టర్ రాహుల్ జైన్ మాట్లాడుతూ.. ‘పాలసీదారు ఎవరైనా ఫిబ్రవరి 28లోగా పాలసీ వివరాలతో తమ పాన్‌ను లింక్ చేసుకోవాలి. అప్పుడే రిజర్వేషన్ కేటగిరీ ద్వారా ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పాలసీదారు రిజర్వేషన్ కేటగిరీలో రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే విధంగా రిటైల్ కేటగిరీలో రూ రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఐపీఓలో ఎల్‌ఐసీ పాలసీదారులకు రూ.60 తగ్గింపు లభిస్తుంది. 6.48 కోట్ల పాలసీదారులు తమ DMAT ఖాతాను తెరిస్తే IPOలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు. ప్రస్తుతానికి డిపాజిటరీల ద్వారా దాదాపు 1.21 కోట్ల డిమ్యాట్ ఖాతాలను పాలసీదారులు తెరిచినట్లు మేము గుర్తించాం. ఎల్‌ఐసీకి కార్పొరేట్ గవర్నెన్స్ తీసుకురావాలని , గుడ్‌ స్టోరీస్‌ షేర్‌ చేసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోంది. కంపెనీ నిజమైన విలువ క్యాపిటల్ మార్కెట్‌లో తెలుస్తుంది.’ అని చెప్పారు.

ఎల్‌ఐసీ ఐపీవోకు మే 4వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. 9వ తేదీన ప్రక్రియ ముగుస్తుంది. కనిష్టంగా బిడ్ 15 షేర్‌లకు అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ షేర్‌లకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే 15 మల్టిపుల్స్‌లో షేర్‌లను ఎంచుకోవాలి.

Published by:Veera Babu
First published:

Tags: IPO, LIC, LIC IPO, Personal Finance

ఉత్తమ కథలు