LIC HOUSING IMGC PARTNERSHIP BORROWERS CAN NOW REPAY HOME LOANS UP TO 75 YEARS OF AGE SS
LIC Home Loan: ఇక 75 ఏళ్ల వరకు ఎల్ఐసీ హోమ్ లోన్ చెల్లించొచ్చు
LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే
LIC Home Loan | ఏ వయస్సులో హోమ్ లోన్ తీసుకున్నా... 60 ఏళ్లకే లెక్కించి టెన్యూర్ నిర్ణయిస్తుంటారు. కానీ ఈ కొత్త పథకంతో రుణగ్రహీతలు 75 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వాయిదాలు చెల్లించే అవకాశముంది.
ఎల్ఐసీ హౌజింగ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త. ఇకపై 75 ఏళ్ల వయస్సు వచ్చేవరకు మీరు ఈఎంఐలు చెల్లించొచ్చు. ఈ మేరకు ఇండియా మార్ట్గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్(IMGC)తో ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్పెషల్ లోన్ స్కీమ్‌లో ఇంటి రుణం తీసుకునేవాళ్లు 75 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఈఎంఐలు చెల్లించొచ్చు. ప్రస్తుతం గరిష్టంగా 60 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే ఏజ్ లిమిట్ ఉంది. ఏ వయస్సులో హోమ్ లోన్ తీసుకున్నా... 60 ఏళ్లకే లెక్కించి టెన్యూర్ నిర్ణయిస్తుంటారు. కానీ ఈ కొత్త పథకంతో రుణగ్రహీతలు 75 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వాయిదాలు చెల్లించే అవకాశముంది. ఈ మేరకు మార్ట్గేజ్ గ్యారెంటీని ఎల్ఐసీకి ఇస్తుంది IMGC.
హోమ్‌లోన్ తీసుకునేవారికి ఊరట కల్పించడం, అర్హతా ప్రమాణాలను పెంచడం, రీపేమెంట్ కాలవ్యవధిని పొడిగించడం, వర్క్ ప్రొఫైల్, వర్క్ ప్లేస్, క్రెడిట్ హిస్టరీ వల్ల తిరస్కరణకు గురైన దరఖాస్తుదారుల ప్రొఫైల్స్‌లో ఆంక్షల్ని సడలించడం కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
— LICHFL ప్రకటన సారాంశం
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ చేసుకున్న ఈ ఒప్పందంతో హోమ్ లోన్ తీసుకునేవారికి కాలవ్యవధి పెరగడంతో పాటు లోన్ మంజూరయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఎల్ఐసీ భావిస్తోంది.
Photos: రెడ్మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.