హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే

Home Loan: తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home Loan | హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్నాయి. ఎక్కడ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఒక్కసారిగా అంత మొత్తం కూడగట్టాలంటే ఎంతో కష్టం. అందుకే బ్యాంకులు గృహ రుణాలను ఇస్తున్నాయి. తక్కువ వడ్డీ రేటుకే గృహరుణాలను అందించే బ్యాంకులున్నాయి. డిసెంబరు 3న జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను మార్చలేదు. ఈ నేపథ్యంలో గహ రుణగ్రహీతలకు మంచి కాలం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఇస్తున్నాయి బ్యాంకులు. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీకే గృహ రుణాలను బ్యాంకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి ఏ బ్యాంకులో వడ్డీ తక్కువగా ఉందో తెలుసుకోండి.

గృహ రుణాలపై తక్కువ వడ్డీరేట్లు అందించే బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇవే...


కోటక్ మహీంద్రా బ్యాంక్- 6.75 శాతం

పంజాబ్ నేషనల్ బ్యాంక్- 6.80

బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85

బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.85

కెనరా బ్యాంక్- 6.90

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 6.90

యూనియన్ బ్యాంక్- 6.90

యాక్సిస్ బ్యాంక్- 6.90

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్- 6.90

బజాజ్ ఫిన్సర్వ్- 6.90

టాటా క్యాపిటల్- 6.90

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 6.95

HDFC లిమెటెడ్- 7.00

ఐసీఐసీఐ బ్యాంక్- 7.00

Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

RTGS: ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్... ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే

ఈ నేపథ్యంలో మీరు కొనాలని చూస్తున్నట్లయితే మీ నిర్ణయం ఆలస్యం చేయాల్సినవసరం లేదు. ఎందుకంటే మీ బ్యాంకు వడ్డీరేట్లు ప్రస్తుత లాభదాయకమైన ఆఫర్ల కంటే ఎక్కువగా ఉంటే రుణదాతలను మార్చుడానికి ఇది మంచి సమయం. భారత్ లో గృహ రుణ రేట్లు 15 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు చౌకైన వడ్డీరేటును అందిస్తుంది. రూ.75 లక్షల గృహరుణపై తక్కువ వడ్డీ రేటు వచ్చేసి ఇక్కడ 6.75 శాతం మాత్రమే. దీని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 బేసిస్ పాయింట్లను(బ్యాంక్ బజార్ డేటా ప్రకారం) అధికంగా ఛార్జ్ చేస్తుంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా క్యాపిటల్ లాంటి సంస్థలు 6.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి.

SBI ATM PIN: ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా? ఒక్క కాల్‌తో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు

Post Office Savings Account: ఖాతాదారులకు అలర్ట్... మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ మారాయి

డేటా లెక్కింపు కోసం రూ.75 లక్షల నిర్ణయాత్మక రుణం తీసుకోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులిచ్చే వడ్డీరేట్లు ఆధారంగా జాబితాలో చేర్చారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్స్(NHB) వెబ్ సైట్లో పొందుపరిచిన హౌసింగ్ ఫైన్సింగ్ కంపెనీలను ఇందులో తీసుకున్నారు. పొందపరచని వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఆయా విభాగాల్లోని బ్యాంకులు, HDFC వడ్డీరేటు ఆధారంగా ఆరోహణ క్రమంలో జాబితా సిద్ధం చేశారు.

గృహం రుణంపై తక్కువ వడ్డీ రేటును అందించే బ్యాంక్ లేదా HFC (రుణం మొత్తం రూ.75 లక్షలు) పైభాగంలో, అత్యధికంగా ఇచ్చే వాటిని దిగువ పొందుపరిచారు. ఈ రుణాన్ని 20 ఏళ్ల కాలపరిమితికి పట్టికలో పేర్కొన్న వడ్డీరేటు ఆధారంగా ఈఎంఐ లెక్కిస్తారు(ప్రాసెసింగ్, ఇతర ఛార్జీల లెక్కలకు ఐఎంఐ సున్నాగా భావిస్తారు).

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank, Bank loans, Banking, Home loan, Housing Loans, Personal Finance

ఉత్తమ కథలు