LIC HOUSING FINANCE LIMITED OFFERS HOME LOAN UP TO RS 2 CRORE WITH LOWER INTEREST RATES SS GH
LIC HFL Home Loan: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ బంపరాఫర్... 6.66 శాతం వడ్డీకే రూ.2 కోట్ల వరకు హోమ్‌లోన్
LIC HFL Home Loan: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ బంపరాఫర్... 6.66 శాతం వడ్డీకే రూ.2 కోట్ల వరకు హోమ్‌లోన్
(image: LIC HFL)
LIC HFL Home Loan | సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే కస్టమర్లకు ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తోంది.
రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని బంపరాఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL). రూ. 2 కోట్ల వరకు తీసుకునే గృహ రుణాలను (Home Loan) కేవలం 6.66 శాతం వడ్డీకే అందిస్తామని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ సిబిల్ స్కోర్ (CIBIL Score) 700 అంతకంటే ఎక్కువ ఉన్న రుణదాతలకు మాత్రమే వర్తిస్తుందని, కస్టమర్ల వృత్తితో సంబంధం లేకుండా రుణాలు మంజూరు (Home Loan Offer) చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 30 మధ్య మంజూరు చేసిన గృహ రుణాలకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. జులైలోనే ఈ ఆఫర్‌ను ప్రకటించినప్పటికీ అప్పుడు కేవలం రూ. 50 లక్షల రుణాలకు మాత్రమే ఆఫర్‌ను పరిమితం చేసింది. ఇప్పుడు ఈ రుణ పరిమితిని రూ. 2 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వారికి లబ్ది చేకూరనుంది.
తాజా ఆఫర్‌పై ఎల్ఐసీ HFL మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ వై విశ్వనాథ గౌడ్ మాట్లాడుతూ ‘‘సిబిల్ స్కోర్ 700, అంతకంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు వారి ఉపాధితో సంబంధం లేకుండా తక్కువ వడ్డీకే గృహ రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించాం. అర్హులైన వినియోగదారులకు కేవలం 6.66 శాతానికే గృహరుణాలు మంజూరు చేస్తాం. ఇది మార్కెట్లోనే అతి తక్కువ వడ్డీ రేటు. కస్టమర్లు దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు మంజూరు చేస్తూ కస్టమర్ల సొంతింటి కల నెరవేర్చాలన్నదే మా లక్ష్యం” అని చెప్పారు.
మరోవైపు, ప్రాసెసింగ్ ఫీజును కూడా ఈ సంస్థ తగ్గించింది. రూ.2 కోట్ల గృహ రుణాలపై గరిష్టంగా రూ.10 వేలు లేదా రుణ మొత్తంలో 0.25 ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. LIC HFL డిజిటల్ విధానంలో గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్లోనే అప్రూవల్ పొందడానికి ఇటీవలే HomY యాప్‌ని కూడా ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా గృహ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
పండుగ సీజన్ సమీపిస్తుండటంతో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహరుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కేవలం 6.70% గృహ రుణాలను అందిస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ 2021 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ రుణదాత ఎస్బీఐ కూడా కేవలం 6.70% వద్ద గృహరుణాలను అందిస్తామని తెలిపింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ఇటీవల తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో హోమ్‌లోన్ వడ్డీరేటు 6.65% నుండి 6.50% కి చేరింది. ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ రేట్లు 6.75% నుంచి ప్రారంభమవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.