LIC Home Loan offer: హోమ్ లోన్ తీసుకునేవారికి ఎల్ఐసీ అద్భుతమైన ఆఫర్స్

LIC Home Loan 2020 offer | ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటే మీరు గృహప్రవేశం చేసిన తర్వాత ఈఎంఐలు చెల్లించొచ్చు. ఇదొక్కటే కాదు... 6 ఈఎంఐలను మాఫీ చేస్తూ మరో ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్.

news18-telugu
Updated: January 17, 2020, 1:02 PM IST
LIC Home Loan offer: హోమ్ లోన్ తీసుకునేవారికి ఎల్ఐసీ అద్భుతమైన ఆఫర్స్
LIC Home Loan 2020 offer: హోమ్ లోన్ తీసుకునేవారికి ఎల్ఐసీ అద్భుతమైన ఆఫర్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనాలనుకుంటున్నారా? ప్లాట్, ఫ్లాట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC అనుబంధ సంస్ధ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LICHFL అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. 'పే వెన్ యూ స్టే' పేరుతో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. అంటే మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటే బిల్డర్ ఆ ఇంటిని మీకు అప్పగించిన తర్వాత లేదా మీకు లోన్ ఇచ్చిన 48 నెలల తర్వాత అసలు కట్టాల్సి ఉంటుంది. అంటే మీకు లోన్ మంజూరు కాగానే ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఈ స్కీమ్ ప్రకటించింది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటే మీరు గృహప్రవేశం చేసిన తర్వాత ఈఎంఐలు చెల్లించొచ్చు. అంతే తప్ప మీకు లోన్ మంజూరైన నాటి నుంచి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అప్పటి వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇదొక్కటే కాదు... 6 ఈఎంఐలను మాఫీ చేస్తూ మరో ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్. ఒక వేళ మీరు నిర్మించి సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొంటే ఈ స్కీమ్ వర్తిస్తుంది. బిల్డర్ నుంచి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడే మీరు ఎంచుకున్న ఈఎంఐలల్లో 6 ఈఎంఐలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. ఈ రెండు ఆఫర్లు 2020 జనవరి 15 నుంచి 2020 ఫిబ్రవరి 29 వరకు దరఖాస్తు చేసుకున్నవారికే వర్తిస్తాయి. మీకు మొదటి చెల్లింపు 2020 మార్చి 15న జరుగుతుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే రూ.1 కోటి లోపు రుణానికి 0.25% గరిష్టంగా రూ.10,000+జీఎస్టీ చెల్లించాలి. రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య రుణాలకు 0.25% గరిష్టంగా రూ.25,000+జీఎస్టీ చెల్లించాలి. లోన్ చెల్లించడానికి కాల వ్యవధి గరిష్టంగా 30 ఏళ్లు ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గృహ రుణాలకు 8.10% వడ్డీ ప్రకటించింది.

కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RBI New Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్

Lock Aadhaar: ఇలా చేస్తే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ వాడుకోలేరుGold Loan: బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటున్నారా? వడ్డీ రేట్లు ఇవే
Published by: Santhosh Kumar S
First published: January 17, 2020, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading