LIC News | ఎల్ఐసీకి చెందిన దేశంలోని ప్రముఖ హౌసింగ్ కంపెనీల్లో ఒకటైన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది. రుణ గ్రహీతలకు కొత్త ఏడాది ముందు ఝలక్ ఇచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడిచింది. దీంతో ఎల్ఐసీ (LIC) హెచ్ఎఫ్ఎల్ నుంచి లోన్ (Loan) తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొత్తగా లోన్ పొందాలని భావిస్తే.. అధిక వడ్డీ రేటును చెల్లించుకోవాల్సి రావొచ్చు.
బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచినట్లుఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడిచింది. డిసెంబర్ 26 నుంచి పెంచిన కొత్త రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో లోన్ తీసుకోవాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. కాగా కేవలం ఈ కంపెనీ మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా సంస్థలు రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేటును పెంచుకుంటూ వెళ్లడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
కేంద్రం అదిరే ఆఫర్.. బ్యాంక్ అకౌంట్‌లోకి ఉచితంగా రూ. 10 వేలు పొందండిలా!
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకారం చూస్తే.. ఎల్‌ఐసీ హౌసింగ్ ప్రైమ్ లెండింగ్ రేటు 35 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ రుణ రేటు ప్రాతిపదికన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. రేట్ల పెంపు తర్వాత చూస్తే ఇప్పుడు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.65 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. డిసెంబర్ 26 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి.
కస్టమర్లకు ఎస్‌బీఐ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఆ చార్జీలు మాఫీ!
ఎల్ఐసీ హౌసింగ్ ప్రైమ్ లెండింగ్ రేటు ఇప్పుడు 16.45 శాతంగా ఉంది. కాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన మారతాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే వారికి ఆకర్షణీయ వడ్డీకే రుణాలు లభిస్తాయి. 800 లేదా ఆపైన క్రెడిట్ స్కోర్ ఉంటే వారికి వడ్డీ రేటు 8.3 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. రూ. 15 కోట్ల వరకు రుణానికి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 750 నుంచి 799 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే.. వడ్డీ రేటు 8.4 శాతంగా ఉంటుంది. రూ. 5 కోట్ల వరకు రుణాలకు ఇది వర్తిస్తుంది. ఆపైన అయితే 8.6 శాతం వడ్డీ పడుతుంది.
సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్యలో ఉంటే అప్పుడు వడ్డీ రేటు 8.7 శాతంగా ఉంది. రూ. 50 లక్షల వరకు ఈ రేటు వర్తిస్తుంది. అదే రూ.50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు లోన్ అయితే వడ్డీ రేటు 8.9 శాతంగా ఉంటుంది. తీసుకున్న రుణాన్ని గరిష్టంగా 30 ఏళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రాపర్టీ విలువలో 90 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loan, Housing Loans, LIC, Money, Rbi