హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: పెరుగుతున్న హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు.. బాదుడు మొదలు పెట్టిన ఆ రెండు సంస్థలు..

Home Loan: పెరుగుతున్న హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు.. బాదుడు మొదలు పెట్టిన ఆ రెండు సంస్థలు..

Home Loans

Home Loans

Home Loan: దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో, రెపో రేటు (Repo Rate) మళ్లీ ప్రీ ప్యాండమిక్‌ లెవల్‌ 5.40 శాతానికి చేరుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (Bajaj Housing Finance) సంస్థలు ఇటీవల హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్ల (Home Loan Interest Rates)ను 0.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో, రెపో రేటు (Repo Rate) మళ్లీ ప్రీ ప్యాండమిక్‌ లెవల్‌ 5.40 శాతానికి చేరుకుంది. మే నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడో సారి రెపో రేటును పెంచింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది. అప్పటి నుంచి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు లోన్‌ రేట్లను సమీక్షిస్తున్నాయి.


* బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
సోమవారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్‌ లోన్‌ వడ్డీ రేటును 0.50 శాతం పాయింట్లు పెంచింది. అధికారిక ప్రకటన ప్రకారం.. అతి తక్కువ వడ్డీ 7.70 శాతంతో జీతం, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు లోన్‌ అందిస్తోంది. తాజాగా హోమ్‌ లోన్‌ వడ్డీ రేటును పెంచినప్పటికీ.. ఇతర కంపెనీలతో పోలిస్తే పోటీ రేట్లకే హోమ్‌ లోన్‌లను అందజేస్తున్నట్లు పేర్కొంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లెండింగ్ రేట్లు ఇప్పుడు జీతం, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు 7.70 శాతం నుంచి ప్రారంభమవుతాయి. స్వయం ఉపాధి దరఖాస్తుదారులు ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల ఆధారంగా 7.95 శాతం నుంచి హొమ్‌ లోన్‌లను పొందే అవకాశం ఉంది.* ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రైమ్ లెండింగ్ రేటు(LHPLR)ను 0.50 శాతం పెంచింది. హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్‌లు గతంలో 7.50 శాతం ప్రారంభమవగా.. ఇప్పుడు 8 శాతం నుంచి మొదలవుతాయి. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ వై విశ్వనాథ గౌడ్ మాట్లాడుతూ..‘రెపో రేటును 0.50 శాతం పెంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ఈఎంఐలు, హోమ్‌ లోన్‌ టెన్యూర్‌లో మినిమిం ఫ్లక్చుయేషన్‌కు కారణమైంది. హౌసింగ్‌కు డిమాండ్ బలంగా ఉంటుంది.’ అని పేర్కొన్నారు.


జీతం తీసుకొనే ఉద్యోగులు, వృత్తి నిపుణులకు CIBIL స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, రూ.10 లక్షల కంటే ఎక్కువ లేదా సమానమైన హోమ్‌ లోన్‌లపై వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది. అదే విధంగా రుణగ్రహీత రూ.50 లక్షల వరకు గృహ రుణాలపై 8.25 శాతం వడ్డీ రేటును, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వాటిపై 7.75 శాతం వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 కోట్ల నుంచి రూ.15 కోట్ల కంటే ఎక్కువ గృహ రుణాలపై 7.90 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : ఆర్‌బీఐ మళ్లీ వడ్డీ రేట్లు పెంచనుందా ?.. లోన్లు మరింత భారమవుతాయా ?


600 నుంచి 699 మధ్య CIBIL స్కోర్‌ ఉన్నవారు రూ.50 లక్షల వరకు హోమ్‌ లోన్‌లపై 8.30 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు 8 శాతం, రూ.2 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు 8.50 శాతం వడ్డీ చెల్లించాలి. CIBIL స్కోర్ 600 కంటే తక్కువ ఉన్నవారికి రూ.50 లక్షల వరకు హోమ్‌ లోన్‌లపై 8.75 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు 8.50 శాతం, అదే విధంగా రూ.2 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు 8.75 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.


CIBIL స్కోర్ 101-200 లేదా NTC ఉన్న వ్యక్తులకు, రూ.50 లక్షల వరకు రుణం కోసం 8.70 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు 8.90 శాతంగా వడ్డీ ఉంది. CIBIL స్కోర్ 700కి సమానం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు రూ.10 లక్షల కంటే ఎక్కువ లేదా సమానమైన గృహ రుణాలపై 8 శాతం వడ్డీ రేటును LIC హౌసింగ్ అందిస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bajaj finance, Home loan, Home loans, LIC, Personal Finance

ఉత్తమ కథలు