Home /News /business /

LIC HFL SLASHES HOME LOAN RATES TO ALL TIME LOW OF 6 66 PER CENT FOR SELECT BORROWERS HERE FULL DETAILS NS GH

LIC HFL: ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి 6.66 శాతం వడ్డీకే హోమ్ లోన్.. ఇంటి వద్దకే వచ్చి లోన్ మంజూరు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా ఎల్​ఐసీ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఆగస్టు 31లోగా హోమ్​లోన్​కు దరఖాస్తు చేసుకున్న వారికి 6.66 శాతం వడ్డీకే హోమ్​లోన్​ అందిస్తున్నట్లు వెల్లడించింది.

సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి ఎల్​ఐసి హౌజింగ్​ ఫైనాన్స్​ లిమిటెడ్​ గుడ్​న్యూస్​ చెప్పింది. ఈ మధ్య కాలంలో కేవలం జీవిత బీమాకే పరిమితం కాకుండా రుణాలు మంజూరు చేయడంలోనూ ప్రభుత్వ రంగ సంస్థ ఎల్​ఐసీ దూసుకుపోతుంది. తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తూ బ్యాంకులు, ఫైనాన్షియల్​ సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్​ఐసీ తాజాగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది. ఆగస్టు 31లోగా హోమ్​లోన్​కు దరఖాస్తు చేసుకున్న కస్టమర్లకు 6.66 శాతం వడ్డీకే హోమ్​లోన్​ అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, రూ. 50 లక్షలలోపు రుణం తీసుకునే కస్టమర్లకే ఈ ఆఫర్​ వర్తిస్తుందని పేర్కొంది. ఈ వడ్డీరేట్లను రుణగ్రహీత సిబిల్​ స్కోర్​ ఆధారంగానిర్ణయిస్తామని తెలిపింది. సిబిల్​ స్కోర్​ 700కు పైగా ఉన్న వారికి 6.66 శాతం నుంచి వడ్డీ రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎల్​ఐసీ హౌసింగ్​ ఫైనాన్స్​ లిమిటెడ్​ (హెచ్​ఎఫ్​ఎల్)కి చెందిన HomeY app ​ ద్వారా ఆన్​లైన్​లో రుణానికి దరఖాస్తు చేసుకుంటే ఇంటి వద్దకే ఎల్​ఐసీ ప్రతినిధి వచ్చి లోన్​ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపింది.
LIC Saral Pension Plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పెన్షన్ ప్లాన్‌.. భారీగా ప్రయోజనాలు.. తెలుసుకోండి
Amazon Small Business Daysలో షాపింగ్ చేయండి.. స్థానిక, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వండి.. ఆఫర్లు రేపటి వరకే..

దీని ద్వారా లోన్​ దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తవుతుందని, ఈ కరోనా సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది. అంతేకాదు, మీ రుణ దరఖాస్తు సంబంధించిన సమస్త సమాచారాన్ని HomeY app ద్వారా ట్రాక్​ చేయవచ్చని తెలిపింది.

ఆగస్టు 31 వరకే అవకాశం..
కాగా.. ఎల్​ఐసీ హౌసింగ్​ ఫైనాన్స్​ లిమిటెడ్​ (హెచ్ఎఫ్ఎల్) గరిష్టంగా 30 సంవత్సరాల గడువు వరకు గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్​ చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా​ మహమ్మారి వేళ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారి కోసం తక్కువ వడ్డీరేటుకే రుణాలు అందిస్తున్నట్లు ఎల్​ఐసీ హెచ్​ఎఫ్​ఎల్​ మేనేజింగ్​ డైరెక్టర్​, సీఈవో వై విశ్వనాథ్​ గౌడ్​ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంత తక్కువ వడ్డీరేటుకు గృహరుణాలు అందించడం ఇదే మొట్టమొదటి సారి అని ఆయన పేర్కొన్నారు. తమ ఎల్​ఐసీ కార్యాలయాన్ని సందర్శించకుండానే HomeY app ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చని, దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Bank loan, Home loan, LIC, LICHFL

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు