మారుతున్న కాలంతో పాటు పెట్టుబడులపై ఆసక్తి పెంచుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కరోనాతో ప్రజల్లో ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరగడంతో స్థిరమైన రాబడినిచ్చే పెట్టుబడి మార్గాలవైపు ఎక్కువ మంది చూస్తున్నారు. అంతేకాక, రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా తమ జీవితాన్ని సాఫీగా గడపడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఎల్ఐసి(LIC), హెచ్.డి.ఎఫ్.సి(HDFC)లలో కార్పొరేట్ డెట్ ఫండ్స్ పై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కాగా,- నేషనల్ పెన్షన్ ఫండ్ కింద తెరిచిన టైర్– I ఖాతాలో పెట్టుబడిపై మంచి రాబడిని ఆర్జిస్తున్నారు. అయితే, ఇటీవల అనేక బ్యాంకింగ్ సంస్థలు మ్యూచువల్ ఫండ్స్(mutual funds)లో పెట్టుబడిపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. దీంతో పెట్టుబడిదారులు పెన్షన్ ఫండ్ల(pension funds)లో పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు. టైర్–1తో పాటు టైర్–2లో పెట్టుబడిపై కూడా మంచి రిటర్న్స్(returns)ను ఆర్జిస్తున్నారు.
2020 డిసెంబర్ 3 నాటికి మ్యూచువల్ ఫండ్ ట్రాకింగ్ సంస్థ వాల్యూ రీసెర్చ్ అందించిన డేటా ప్రకారం, గత మూడు, ఐదు సంవత్సరాల రిటర్న్ వ్యవధిలో, టైర్- II ఖాతాల విషయంలో ఎల్ఐసి పెన్షన్ అగ్రస్థానంలో ఉంది. ఇవి మూడు, ఐదేళ్ల కాలపరిమితుల్లో వరుసగా 10.42 శాతం, 10.22 శాతం రాబడిని అందిస్తున్నాయి. అదే, హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్ ఫండ్ విషయానికి వస్తే, ఇది వరుసగా మూడు, ఐదేళ్ల కాలానికి సంవత్సరానికి 10.09 శాతం, 10.12 శాతం లాభాలను ఇస్తోంది. కాగా, ఇదే కాలంలో ఇతర పెన్షన్ ఫండ్ స్కీమ్లు రెండంకెల రాబడిని నమోదు చేయలేకపోవడం గమనార్హం.
సెక్షన్ 80 కింద ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను మినహాయింపు..
టైర్- II ఖాతాల్లో పెట్టుబడికి ఎటువంటి పరిమితులు ఉండవు. దీనిలో పెట్టుబడికి లాక్-ఇన్ పీరియడ్(lock in prriod) లేనందున, అవసరం వచ్చినప్పుడు మీ పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. అయితే, టైర్- II ఖాతా తెరవడానికి మీరు కనీసం రూ .1,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మినిమం కాంట్రిబ్యూషన్ కింద కనీసం రూ .250 పెట్టుబడిగా పెట్టాలి. మీరు టైర్ 1 -, టైర్ -2 ఖాతాల కోసం వేర్వేరు పెన్షన్ ఫండ్ (pension fund)నిర్వాహకులను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
కాగా, మీరు మీ కార్పస్‌ను నిర్వహించడానికి యాక్టివ్, ఆటో ఛాయిస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ను ఎంచుకోవచ్చు. అయితే, టైర్ -2లో పెట్టుబడిపై సెక్షన్ 80 కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పన్ను మినహాయింపును పొందుతుండగా, ఈ ప్రయోజనం మాత్రం ప్రైవేటు రంగ ఉద్యోగులకు అందుబాటులో లేదు. టైర్- I అకౌంట్లు కేవలం పదవీ విరమణ కోసం డబ్బు కూడబెట్టడానికి ఉద్దేశించబడినవి. మీ మెచ్యూరిటీ తీరక ముందే పెట్టుబడిని ఉపసంహరించుకోవాలి అనుకుంటే, కేవలం 20 శాతం మాత్రమే పొందుతారు.
మిగిలిన మొత్తం యాన్యుటీలుగా మార్చబడుతుంది. అయితే, మీ పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, ఇళ్లు కొనుగోలు లేదా నిర్మాణం, క్రిటికల్ ఇల్నెస్ ట్రీట్మెంట్ వంటి వాటికి డబ్బు సమకూర్చుకోవడం కోసం బ్యాలెన్స్‌లో 25 శాతం వరకు -ఉపసంహరణ చేసుకునే వెలుసుబాటు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Money making