ALERT: ఈ పాలసీలను నిలిపేసిన ఎల్ఐసీ... అవి మీ దగ్గర ఉంటే ఏం చేయాలి?

పాలసీలపై మంచి లాభాలను అందించడం కష్టమవుతోందని కంపెనీ చెబుతోంది. అందుకే ఆ పాలసీలను ఆపేసింది. వాటిని నిలిపివేస్తున్నట్టు అధికారిక వెబ్‌సైట్‌లోనూ వెల్లడించింది. అయితే ఏఏ పాలసీలు ఆగిపోయాయో తెలుసుకోండి. ఎవరైనా ఆ పాలసీలను అమ్ముతామని మీ దగ్గరకు వస్తే అలర్ట్ అవండి.


Updated: January 8, 2019, 1:08 PM IST
ALERT: ఈ పాలసీలను నిలిపేసిన ఎల్ఐసీ... అవి మీ దగ్గర ఉంటే ఏం చేయాలి?
ప్రతీకాత్మక చిత్రం

Updated: January 8, 2019, 1:08 PM IST
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... ఎల్ఐసీ. ఈ సంస్థ గురించి తెలియని వాళ్లుండరు. దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం ఎల్ఐసీ సేవలు విస్తరించాయి. అయితే ఇటీవల ఎల్ఐసీ కొన్ని పాలసీలను ఆపేసింది. 2017 డిసెంబర్‌లో జీవన్ అక్షయ్ పాలసీ నుంచి ఇప్పటి వరకు అనేక పాలసీలను నిలిపివేసింది ఎల్ఐసీ. వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో ఆయా పాలసీలపై మంచి లాభాలను అందించడం కష్టమవుతోందని కంపెనీ చెబుతోంది. అందుకే ఆ పాలసీలను ఆపేసింది. వాటిని నిలిపివేస్తున్నట్టు అధికారిక వెబ్‌సైట్‌లోనూ వెల్లడించింది. అయితే ఏఏ పాలసీలు ఆగిపోయాయో తెలుసుకోండి. ఎవరైనా ఆ పాలసీలను అమ్ముతామని మీ దగ్గరకు వస్తే అలర్ట్ అవండి.

ఎల్ఐసీ ఆపేసిన పాలసీలు ఇవే...
జీవన్ సుగమ్, జీవన్ వైభవ్ (సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ అస్యూరెన్స్ ప్లాన్), జీవన్ వృద్ధి, ఫార్చ్యూన్ ప్లస్ ప్లాన్, వెల్త్ ప్లప్, మార్కెట్ ప్లస్-1, ప్రాఫిట్ ప్లస్, మనీ ప్లస్-1, చైల్డ్ ఫార్చ్యూన్ ప్లస్, జీవన్ సాథి ప్లస్, సమృద్ధి ప్లస్, పెన్షన్ ప్లస్, జీవన్ నిధి, న్యూ జీవన్‌ధార-1, న్యూ జీవన్ సురక్ష-1, హెల్త్ ప్లస్, వెల్త్ ప్లస్, ప్రాఫిట్ ప్లస్, మనీ ప్లస్, గ్రూప్ సూపర్ యాన్యుషన్ ప్లస్, బీమా అకౌంట్-1, బీమా అకౌంట్-2, సీడీఏ ఎండోమెంట్, జీవన్ మిత్ర(ట్రిపుల్ సెక్యూరిటీ), మనీ బ్యాక్ పాలసీ-25 ఏళ్లు, జీవన్ మిత్ర(డబుల్ సెక్యూరిటీ), జీవన్ ప్రముఖ్ హోల్ లైఫ్ పాలసీ, హోల్ లైఫ్ పాలసీ-లిమిటెడ్ పేమెంట్, రెండేళ్ల తాత్కాలిక పాలసీ, జీవన్ మిత్ర(డబుల్ కవర్ ఎండోమెంట్ ప్లాన్), జీవన్ అమృత్, జీవన్ సురభి-25 ఏళ్లు, జీవన్ సురభి-15 ఏళ్లు, హోల్ లైఫ్ పాలసీ-సింగిల్ ప్రీమియం, జీవన్ అనురాగ్, చైల్డ్ ఫ్యూచర్ ప్లాన్, చైల్డ్ కెరీర్ ప్లాన్, జీవన్ సాథి, జీవన్ శ్రీ-1, జీవన్ అంకుర్, ఎండోమెంట్ ఇన్స్యూరెన్స్ పాలసీ-లిమిటెడ్ పేమెంట్, మ్యారేజ్ ఎండోమెంట్, ఎడ్యుకేషనల్ యాన్యుటీ ప్లాన్, అన్మోల్ జీవన్-1, యాన్యువల్ ప్లాన్, జీవన్ ఛాయ, కోమల్ జీవన్, జీవన్ కిషోర్, మనీ బ్యాక్ పాలసీ-20 ఏళ్లు, జీవన్ తరంగ్, న్యూ బీమా గోల్డ్, ఎండోమెంట్ ఇన్స్యూరెన్స్ పాలసీ, బీమా నివేష్ 2005, జీవన్ సరళ్ పాలసీలను నిలిపివేసారు.

ఏ పాలసీలు తీసుకోవచ్చు?
ఇవి కాకుండా మీరు జీవన్ ఆనంద్, బీమా బచత్, జీవన్ ఆధార్, జీవన్ విశ్వాస్, జీవన్ దీప్, జీవన్ మంగళ్, జీవన్ మధుర్, ఎండోమెంట్ ప్లస్, న్యూ జీవన్ నిధి, అమూల్య జీవన్-1, ఫ్లెక్సీ ప్లస్, జీవన్ సురభి-20 ఏళ్లు, జీవన్ భారతి-1, హెల్త్ ప్రొటెక్షన్ ప్లస్, జీవన్ షగుణ్, వర్షిష్ట పెన్షన్ బీమా యోజన పాలసీలు తీసుకోవచ్చు.



నిలిపివేసిన పాలసీలు మీదగ్గరుంటే ఏం చేయాలి?
ఎల్ఐసీ నిలిపివేసిన పాలసీలను మీరు గతంలో తీసుకున్నట్టయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాలసీ తీసుకునే సమయంలో మీకు హామీ ఇచ్చిన లాభాలన్నీ మెచ్యూరిటీ తర్వాత పొందొచ్చు. కాకపోతే మళ్లీ అలాంటి పాలసీలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఎవరైనా ఈ పాలసీలు అమ్ముతామంటే నమ్మకూడదు.

ఇవి కూడా చదవండి:

LIC POLICY: రోజూ రూ.121 పొదుపుతో అమ్మాయి పెళ్లికి రూ.27 లక్షల రిటర్న్స్

లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? తెలుసుకోండి

మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!

లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? తెలుసుకోండి

 
First published: January 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...