హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Dhan Sanchay: ఎల్ఐసీ నుంచి ధన్ సంచయ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

LIC Dhan Sanchay: ఎల్ఐసీ నుంచి ధన్ సంచయ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

LIC Dhan Sanchay: ఎల్ఐసీ నుంచి ధన్ సంచయ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
(image: LIC)

LIC Dhan Sanchay: ఎల్ఐసీ నుంచి ధన్ సంచయ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే (image: LIC)

LIC Dhan Sanchay | ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఎల్ఐసీ నుంచి ధన్ సంచయ్ (LIC Dhan Sanchay) పేరుతో మరో కొత్త పాలసీ (LIC Policy) వచ్చింది.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వేర్వేరు వర్గాలు, వేర్వేరు వయస్సుల వారికి ప్రత్యేక పాలసీలు అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మరో కొత్త పాలసీని ప్రకటించింది. ఎల్ఐసీ ధన్ సంచయ్ (LIC Dhan Sanchay) పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. మంగళవారం నుంచే ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఈ పాలసీ తీసుకున్నవారికి జీవిత బీమాతో పాటు సేవింగ్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. మెచ్యూరిటీ తర్వాత పేఔట్ పీరియడ్‌లో గ్యారెంటీడ్ ఇన్‌కమ్ వస్తుందని ఎల్ఐసీ చెబుతోంది. దీంతో పాటు గ్యారెంటీడ్ టర్మినల్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.

ఎల్ఐసీ ధన్ సంచయ్ ప్లాన్ కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 15 ఏళ్ల టర్మ్‌తో లభిస్తుంది. లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, ఇంక్రీసింగ్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ ప్రీమియం లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ బెనిఫిట్ పేరుతో నాలుగు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీడ్ ఇన్‌కమ్ బెనిఫిట్, గ్యారెంటీడ్ టెర్మినల్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న కాలంలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక మద్దతు లభిస్తుంది. డెత్ బెనిఫిట్ కూడా ఒకేసారి పొందొచ్చు. లేదా ఐదేళ్లపాటు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందొచ్చు. పాలసీ తీసుకునే సమయంలోనే ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

SBI Good News: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎల్ఐసీ ధన్ సంచయ్ ప్లాన్‌లో లోన్ సదుపాయం కూడా ఉంది. ఇతర రైడర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సమ్ అష్యూర్డ్ విషయానికి వస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్ బీ ఎంచుకుంటే కనీసం రూ.3,30,000, ఆప్షన్ సీ ఎంచుకుంటే రూ.2,50,000, ఆప్షన్ డీ ఎంచుకుంటే రూ.22,00,000 సమ్ అష్యూర్డ్ ఉండాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు మూడేళ్లు. ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీని ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. లేదా ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు.

LIC Policy: రోజుకు రూ.45 పొదుపు చేస్తే ఏటా రూ.36,000 రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

ఇక ఎల్ఐసీ ఇటీవల బీమా రత్న మరో ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి నెలకోసారి, ఏడాదికోసారి చొప్పున ఆర్థికంగా మద్దతు కూడా లభిస్తుంది. ఎల్ఐసీ బీమా రత్న పాలసీని కనీసం రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో తీసుకోవచ్చు. పాలసీ గడువు 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు చొప్పున ఎంచుకోవచ్చు. 15 ఏళ్ల పాలసీకి 13, 14వ ఏడాదిలో 25 శాతం చొప్పున, 20 ఏళ్ల పాలసీకి 18, 19వ ఏడాదిలో 25 శాతం చొప్పున, 25 ఏళ్ల పాలసీకి 23, 24వ ఏడాదిలో 25 శాతం చొప్పున బెనిఫిట్ లభిస్తుంది. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 5 ఏళ్లు.

First published:

Tags: Insurance, LIC

ఉత్తమ కథలు