మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త పాలసీని ప్రకటించింది. ఎల్ఐసీ ధన రేఖ ప్లాన్ (LIC Dhan Rekha Plan) డిసెంబర్ 13న అందుబాటులోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్. ఈ పాలసీలో అనేక బెనిఫిట్స్, ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ పాలసీలో ఓ ప్రత్యేకత ఏంటంటే మహిళలకు స్పెషల్ ప్రీమియం రేట్స్ ఉంటాయి. ఈ పాలసీని థర్డ్ జెండర్‌కు కూడా ఆఫర్ చేస్తోంది ఎల్ఐసీ. ఈ ప్లాన్ ద్వారా బెనిఫిట్స్ అన్నీ గ్యారెంటీడ్ అని ఎల్ఐసీ చెబుతోంది. మరి ఈ పాలసీ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
PAN Card: పాన్ కార్డ్ మర్చిపోయారా? మీ ఆధార్ నెంబర్‌తో సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా
కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్- రూ.2,00,000
గరిష్ట బేసిక్ సమ్ అష్యూర్డ్- పరిమితి లేదు
పాలసీ గడువు- 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్లు
ప్రీమియం పేయింగ్ టర్మ్- 20 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 10 ఏళ్లు, 30 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 15 ఏళ్లు, 40 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 20 ఏళ్లు
కనీస వయస్సు- 20 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 8 ఏళ్లు, 30 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 3 ఏళ్లు, 40 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 90 రోజులు
గరిష్ట వయస్సు- 20 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 55 ఏళ్లు, 30 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 45 ఏళ్లు, 40 ఏళ్ల పాలసీ టర్మ్‌కు 35 ఏళ్లు
ఈ పాలసీ తీసుకున్న ఆరేళ్ల నుంచి ప్రతీ ఏడాది గ్యారెంటీడ్ అడిషన్స్ లభిస్తాయని ఎల్ఐసీ చెబుతోంది. మెచ్యూరిటీ తర్వాత పాలసీ హోల్డర్‌కు మనీ బ్యాక్ డబ్బులు మినహాయించకుండా మొత్తం సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. గ్యారెంటీడ్ అడిషన్స్ కూడా లభిస్తాయి. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న కాలంలో మరణిస్తే వారి కుటుంబానికి పాలసీ డబ్బులు లభిస్తాయి.
Credit Card Charges: మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ 6 ఛార్జీల గురించి మీకు తెలుసా?
సింగిల్ ప్రీమియం చెల్లించినవారికి బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు 125 శాతం, గ్యారెంటీడ్ అడిషన్స్ లభిస్తాయి. లిమిటెడ్ పేమెంట్ ప్రీమియం చెల్లించినవారికి బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు 125 శాతం లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. గ్యారెంటీడ్ అడిషన్స్ కూడా లభిస్తాయి. మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ ఒకేసారి కాకుండా ఐదేళ్లు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు.
ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్లకు సింగిల్ ప్రీమియం పాలసీ తీసుకుంటే ఒకేసారి రూ.7,17,350 ప్రీమియం చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే ఏడాదికి రూ.1,02,639 చొప్పున ప్రీమియం చెల్లించాలి. వయస్సు పెరిగిన కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. ఈ పాలసీ తీసుకున్నవారికి లోన్ సదుపాయం, రైడర్స్ కూడా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.