హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC New Pension Plus Plan: ఎల్‌ఐసీ న్యూ పెన్షన్‌ ప్లస్‌ ప్లాన్‌ లాంచ్‌.. ప్రీమియం, ఫండ్స్‌, ప్లాన్ రూల్స్ ఇవే..

LIC New Pension Plus Plan: ఎల్‌ఐసీ న్యూ పెన్షన్‌ ప్లస్‌ ప్లాన్‌ లాంచ్‌.. ప్రీమియం, ఫండ్స్‌, ప్లాన్ రూల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) కొత్త పెన్షన్ ప్లస్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్-లింక్డ్, ఇండివిడ్యువల్ పెన్షన్ ప్లాన్ సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తును కోరుకుంటున్నారు. దీని కోసం ఒక క్రమపద్ధతిలో, క్రమశిక్షణతో పొదుపు (Savings) చేస్తుంటారు. ఈ అవసరాలను గుర్తించిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC), కొత్త పెన్షన్ (Pension) ప్లస్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్-లింక్డ్, ఇండివిడ్యువల్ పెన్షన్ ప్లాన్ సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ప్లాన్‌ సాయంతో పాలసీదారులు క్రమబద్ధంగా, క్రమశిక్షణతో పొదుపు చేయవచ్చు. టర్మ్ పూర్తయిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ద్వారా దీన్ని రెగ్యులర్‌ ఇన్‌కమ్‌గా మార్చుకోవచ్చు.

పాలసీ వ్యవధిని ఎంచుకొనే అవకాశం

న్యూ పెన్షన్‌ ప్లస్‌ ప్లాన్‌ను సింగిల్‌ ప్రీమియం పేమెంట్‌ పాలసీ లేదా రెగ్యులర్‌ ప్రీమియం పేమెంట్‌గా కొనుగోలు చేయవచ్చు. పాలసీ వ్యవధిలో రెగ్యులర్‌ పేమెంట్‌ ఆప్షన్‌ కింద ప్రీమియం చెల్లించాలి. పాలసీదారులు కనీస, గరిష్ఠ ప్రీమియం, పాలసీ టర్మ్, వయసు ఆధారంగా ప్రీమియం మొత్తాన్ని, పాలసీ వ్యవధిని ఎంచుకునే అవకాశం ఉంది. కొన్ని షరతులకు లోబడి పొదుపు చేసే వ్యవధిని కూడా పొడిగించుకోవచ్చు.

LIC పాలసీదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ఫీజుపై భారీ తగ్గింపు.. తప్పక తెలుసుకోండి

నాలుగు ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు

పాలసీ సబ్‌స్క్రైబర్ నాలుగు రకాల ఫండ్‌లలో ప్రీమియంలను పెట్టుబడి పెట్టవచ్చు. చెల్లించిన ప్రతి ప్రీమియంపై ప్రీమియం అలొకేషన్‌ ఛార్జీ విధిస్తారు. అలొకేషన్‌ రేటుగా పేర్కొనే బ్యాలెన్స్ మొత్తం ప్రీమియంలో కొంత భాగంగా ఉంటుంది. ఇది పాలసీదారు ఎంచుకున్న ఫండ్ యూనిట్‌లను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. పాలసీదారులు ఛేంజ్‌ ఆఫ్‌ పండ్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ అవకాశం సంవత్సరానికి నాలుగు సార్లు అందుబాటులో ఉంటుంది.

ఇన్-ఫోర్స్ పాలసీ కింద, గ్యారెంటీడ్‌ అడిషన్స్‌ను ఒక యాన్యువల్‌ ప్రీమియం పర్సంటేజ్‌గా చెల్లిస్తారు. రెగ్యులర్‌ ప్రీమియంపై గ్యారెంటీడ్‌ అడిషన్‌ 5.0-15.5 శాతం వరకు ఉంటుంది. నిర్దిష్ట పాలసీ సంవత్సరం పూర్తయిన తర్వాత సింగిల్ ప్రీమియంపై 5 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకున్న ఫండ్ రకం ప్రకారం యూనిట్‌లను కొనుగోలు చేయడానికి హామీ గ్యారెంటీడ్‌ అడిషన్స్‌ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.

మంగళవారం రూ.652.80 వద్ద షేర్ ప్రైజ్ క్లోజ్‌

మంగళవారం ఎల్‌ఐసీ షేరు ప్రైస్‌ బీఎస్‌ఈలో రూ.652.80 వద్ద క్లోజ్‌ అయింది. ముందు రోజు క్లోజింగ్‌ ప్రైజ్‌తో పోలిస్తే 1.04 శాతం షేరు ధర తగ్గింది. కాగా, ఈ ఏడాది మేలో ఎల్‌ఐసీ ఐపీఓను ప్రారంభించింది. ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.5,53,721.92 లక్షల కోట్లతో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మేలో మార్కెట్ లిస్టింగ్ రోజున వాల్యుయేషన్ పరంగా ఐదవ అతిపెద్ద కంపెనీగా అవతరించింది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Health Insurance, Life Insurance, Pensions, Savings

ఉత్తమ కథలు