Home /News /business /

LIC BIMA RATNA POLICY LIFE INSURANCE CORPORATION OF INDIA LAUNCHED NEW SAVINGS LIFE INSURANCE PLAN SS

LIC Bima Ratna: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... బీమా రత్న ప్లాన్‌తో బెనిఫిట్స్ ఇవే

LIC Bima Ratna: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... బీమా రత్న ప్లాన్‌తో బెనిఫిట్స్ ఇవే
(image: LIC)

LIC Bima Ratna: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... బీమా రత్న ప్లాన్‌తో బెనిఫిట్స్ ఇవే (image: LIC)

LIC Bima Ratna | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్తగా సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించింది. 25 ఏళ్ల పాలసీకి 20 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరికొత్త పాలసీని ప్రకటించింది. బీమా రత్న (LIC Bima Ratna) పేరుతో కొత్త ప్లాన్ ప్రకటించింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్‌లో రక్షణతో పాటు సేవింగ్స్ కలిపి ఉంటాయి. కార్పొరేట్ ఏజెంట్లు, ఇన్స్యూరెన్స్ మార్కెటింగ్ సంస్థలు, బ్రోకర్ల ద్వారా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్నవారు పాలసీ కొనసాగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. అంతేకాదు... నామినీ కోరుకున్నట్టుగా నెలకోసారి, ఏడాదికోసారి చొప్పున ఆర్థికంగా మద్దతు కూడా లభిస్తుంది.

ఎల్ఐసీ బీమా రత్న ప్రయోజనాలు ఇవే...


ఎల్ఐసీ బీమా రత్న పాలసీని కనీసం రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. రూ.25,000 చొప్పున ఎంతైనా పెంచుకుంటూ వెళ్లొచ్చు. పాలసీ గడువు 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు చొప్పున ఎంచుకోవచ్చు. 15 ఏళ్ల గడువు ఎంచుకుంటే 11 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. 21 ఏళ్ల గడువు ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. 25 ఏళ్ల గడువు ఎంచుకుంటే 20 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి.

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు దొరకవా? ఆర్‌బీఐ ఏం చెబుతోందంటే

ఎల్ఐసీ బీమా రత్న పాలసీ 15 ఏళ్ల గడువుతో తీసుకోవాలనుకుంటే కనీస వయస్సు 5 ఏళ్ల నుంచి గరిష్ట వయస్సు 55 ఉండాలి. 20 ఏళ్లు, 25 ఏళ్ల గడువుతో తీసుకోవాలనుకుంటే కనీస వయస్సు 90 రోజుల వయస్సు ఉండాలి. గరిష్ట వయస్సు 20 ఏళ్ల పాలసీకి 50 ఏళ్లు, 25 ఏళ్ల పాలసీకి 45 ఏళ్లు ఉండాలి. అంటే పాలసీ మెచ్యూరిటీ అయ్యే సమయానికి గరిష్ట వయస్సు 70 ఏళ్లు అవుతుంది.

ఎల్ఐసీ బీమా రత్న పాలసీ తీసుకునే వ్యక్తి వయస్సు 8 ఏళ్ల లోపు ఉంటే పాలసీ తీసుకున్న రెండేళ్ల తర్వాత రిస్క్ కవర్ ప్రారంభం అవుతుంది. ఒకవేళ వయస్సు 8 ఏళ్ల పైనే ఉంటే రిస్క్ కవర్ వెంటనే మొదలవుతుంది. 15 ఏళ్ల పాలసీకి 13, 14వ ఏడాదిలో 25 శాతం చొప్పున, 20 ఏళ్ల పాలసీకి 18, 19వ ఏడాదిలో 25 శాతం చొప్పున, 25 ఏళ్ల పాలసీకి 23, 24వ ఏడాదిలో 25 శాతం చొప్పున బెనిఫిట్ లభిస్తుంది.

Bank Account: ఖాతాదారులకు అలర్ట్... ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి మే 29 నుంచి కొత్త రూల్స్

ఉదాహరణకు 35 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 25 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.20,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ బీమా రత్న ప్లాన్ తీసుకున్నారనుకుందాం. వారికి రూ.25,00,000 సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ వర్తిస్తుంది. ప్రీమియం 21 ఏళ్లు చెల్లించాలి. వార్షిక ప్రీమియం రూ.1,18,726. మొదటి ఏడాది 4.50 శాతం, ఆ తర్వాత నుంచి 2.25 శాతం చొప్పున జీఎస్‌టీ వర్తిస్తుంది. 20 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.24,93,246 అవుతుంది. సర్వైవల్ బెనిఫిట్ కింద 23 ఏడాదిలో రూ.5,00,000, 24 ఏడాదిలో రూ.5,00,000 లభిస్తుంది. మొత్తం మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.38,50,000 లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు