మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ ఉందా? రెగ్యులర్‌గా ప్రీమియంలు చెల్లిస్తున్నారా? మరి మీ పాన్ నెంబర్ ఎల్ఐసీ పాలసీకి లింక్ (LIC PAN Number Link) చేస్తున్నారా? ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు తమ పాన్ నెంబర్లను పాలసీకి లింక్ (LIC PAN Card Link) చేయాలని కోరుతోంది. ఆన్‌లైన్‌లోనే ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయొచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయాలి. మీ పాన్ నెంబర్ ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయడానికి ముందు పాలసీ నెంబర్, పాన్ నెంబర్ లాంటి వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. మీ ఎల్ఐసీ పాలసీకి లింక్ ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఈ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Business Idea: లక్షల్లో ఆదాయం కావాలా? ఈ కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా
ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేస్తే పాలసీ క్లెయిమ్ చేసే సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఇప్పటికే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 30 వరకు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఇక ఇప్పుడు ఎల్ఐసీ కూడా పాన్ నెంబర్‌ను ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయాలని కోరుతోంది. మరి మీ ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.
IRCTC: ఐఆర్‌సీటీసీతో కలిసి బిజినెస్ చేయండి... రూ.80,000 వరకు లాభం పొందండి
Link your PAN to your LIC policies now!
Log on to https://t.co/fA1vgvFfeK pic.twitter.com/4DUp0xSRdc
— LIC India Forever (@LICIndiaForever) September 7, 2021
ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు ముందుగా https://licindia.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Online Services సెక్షన్‌లో Online PAN Registration పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
జెండర్ సెలెక్ట్ చేయాలి.
ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
పాన్ కార్డుపై ఉన్నట్టుగా పూర్తి పేరును ఎంటర్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
వివరాలన్నీ సరిచూసుకొని ఓటీపీ ఎంటర్ చేయాలి.
మీ ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, LIC, PAN, PAN card, Personal Finance