హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC News: ఎల్‌ఐసీ కస్టమర్లకు అలర్ట్.. మార్చి 31లోపు ఇలా చేయండి! లేదంటే..

LIC News: ఎల్‌ఐసీ కస్టమర్లకు అలర్ట్.. మార్చి 31లోపు ఇలా చేయండి! లేదంటే..

LIC News: ఎల్‌ఐసీ కస్టమర్లకు అలర్ట్.. మార్చి 31లోపు ఇలా చేయండి! లేదంటే..

LIC News: ఎల్‌ఐసీ కస్టమర్లకు అలర్ట్.. మార్చి 31లోపు ఇలా చేయండి! లేదంటే..

LIC Policy | మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలుతెలుసుకోవాల్సిందే. మార్చి 31లోపు మీరు ఒక పని పూర్తి చేయాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Pan Card | ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ - LIC) కీలక ప్రకటన చేసింది. ఎల్ఐసీ పాలసీ కలిగిన వారు వారి పాన్ కార్డును పాలసీతో లింక్ చేసుకోవాలని కోరింది. మార్చి 31 లోపు ఇలా చేయాలని సూచించింది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సర్వీసులు పొందాలని భావించే వారు కచ్చితంగా పాన్ కార్డును (Pan Card) పాలసీతో లింక్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంటోంది.

ఎల్ఐసీ పాలసీ తీసుకున్న వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి పాన్ కార్డుతో పాలసీని లింక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎల్ఐసీ తన కస్టమర్ల మరో రెండు అంశాల గురించి కూడా అప్‌డేట్ ఇచ్చింది. మొబైల్ నెంబర్ కూడా అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. ఇంకా ఇమెయిల్ అడ్రస్ కూడా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. దీని ద్వారా ఎల్ఐసీ కస్టమర్లు సులభంగానే ఆన్‌లైన్ ద్వారా ఎల్ఐసీ సేవలు పొందొచ్చని తెలిపింది.

గ్యాస్ సిలిండర్ వాడే వారికి శుభవార్త.. 6 అదిరే ఆఫర్లు, భారీ తగ్గింపు పొందండిలా!

ఎల్ఐసీకి దాదాపు 25 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. అందువల్ల ఎల్ఐసీ పాలసీ కలిగిన వారు కచ్చితంగా వెంటనే ఈ పనులు పూర్తి చేసుకోండి. లేదంటే పాలసీ మెచ్యూరిటీ సమయంలో లేదంటే ఇతర ఇతర సేవలు పొందేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కాగా ఎల్ఐసీ తన కస్టమర్లకు వివిధ రకాల పాలసీలు అందిస్తున్నా విషయం తెలిసిందే. వీటిలో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ దగ్గరి నుంచి చిల్ట్రన్ ప్లాన్స్ వరకు చాలానే ఉన్నాయి.

ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. కస్టమర్లకు పండుగ శుభవార్త, బ్యాంక్ కీలక ప్రకటన!

ఎల్ఐసీ పాలసీతో పాన్ కార్డు లింక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా ఎల్ఐసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రోసీడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పుట్టిన తేదీ, జెండర్, పాన్ కార్డు, పేరు, మొబైల్ నెంబర్, పాలసీ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి.

అంతే మీ పాన్ కార్డు ఎల్ఐసీ పాలసీతో లింక్ అవుతుంది. మీరు మీ పాలసీతో పాన్ నెంబర్ లింక్ అయ్యిందా? లేదా? అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్లాలి. అక్కడ చెక్ పాలసీ పాన్ స్టేటస్ అని ఉంటుంది. దీని ద్వారా మీరు మీ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు.

First published:

Tags: Insurance, LIC, PAN, PAN card

ఉత్తమ కథలు