• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LIC APPOINTS PAYTM TO HANDLE ITS DIGITAL PAYMENTS MK GH

LIC పాలసీదారులకు గుడ్​న్యూస్​.. డిజిటల్​ చెల్లింపుల కోసం paytmతో ఒప్పందం

LIC పాలసీదారులకు గుడ్​న్యూస్​.. డిజిటల్​ చెల్లింపుల కోసం paytmతో ఒప్పందం

ప్రతీకాత్మకచిత్రం

ఎల్​ఐసీ ప్రీమియంలను పేటీఎం ద్వారా చెల్లించేందుకు వివిధ బ్యాంకుల యూపీఐ ఛానెల్​ను లేదా వాలెట్లను ఉపయోగించుకోవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, దాదాపు 17 చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు ఎల్‌ఐసితో ఒప్పందం కుదుర్చుకోవడానికి వేలంలో పాల్గొన్నాయి. అయితే, చివరకి పేటీఎం ఈ అవకాశాన్ని దక్కించుకుంది.

  • Share this:
కరోనా విజృంభనతో అంతా డిజిటల్​ చెల్లింపుల​కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కస్టమర్లకు డిజిటల్​ సర్వీసులను అందించేందుకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో, ఎల్​ఐసీ పాలసీదారులు నేరుగా తమ పాలసీ అమౌంట్​ను పేటీఎం ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది. పాలసీదారులకు విస్తృత శ్రేణి డిజిటల్ చెల్లింపు సేవలను అందించాలనే లక్ష్యంతో పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్​ఐసీ ప్రకటించింది. కాగా, ఎల్​ఐసీ ఇంతకుముందే పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అప్పుడు అన్ని పేమెంట్స్​ను ఆప్షన్స్​ను అందించలేదు. కానీ, ప్రస్తుతం కుదుర్చున్న ఒప్పందంతో అన్ని పేమెంట్​ ఆప్షన్స్​ డిజిటల్ మోడ్‌లకు మార్చింది.

ఇప్పుడు ఎల్​ఐసీ ప్రీమియంలను పేటీఎం ద్వారా చెల్లించేందుకు వివిధ బ్యాంకుల యూపీఐ ఛానెల్​ను లేదా వాలెట్లను ఉపయోగించుకోవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, దాదాపు 17 చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు ఎల్‌ఐసితో ఒప్పందం కుదుర్చుకోవడానికి వేలంలో పాల్గొన్నాయి. అయితే, చివరకి పేటీఎం ఈ అవకాశాన్ని దక్కించుకుంది. 2020లో కరోనా మహమ్మారి తరువాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయని ఎల్​ఐసీ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో రూ. 60,000 కోట్ల విలువైన ప్రీమియంలను ఒక్క డిజిటల్ మోడ్‌ ద్వారానే పాలసీదారుల నుంచి వసూలు చేసింది. కాగా, ఎల్​ఐసీ ప్రస్తుతం ఎనిమిది కోట్ల పాలసీదారులను కలిగి ఉంది. వారందిరికీ డిజిటల్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో నే పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా ఉదృతి మరింతగా పెరుగుతుండటంతో ఎల్​ఐసీ పాలసీదారుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

కరోనాతో పెరిగిన డిజిటల్​ ట్రాన్సాక్షన్స్​..
ఇదిలా ఉంటే, కరోనా విజృంభనతో ఎల్​ఐసీ డెత్​ క్లెయిమ్​లు కూడా భారీగా పెరిగిపోయాయి. రెగ్యులేటరీ సంస్థ ఐఆర్​డీఏకు ఎల్​ఐసీ ఇటీవల అందించిన డేటా ప్రకారం, గతేడాది ఏప్రిల్–డిసెంబర్​ మధ్య డెత్​ క్లెయిములు 8 లక్షలను దాటాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే డెత్​ క్లెయిమ్​లు 21 శాతం మేర పెరిగాయి. ఇంత తక్కువ కాలంలో భారీ ఎత్తున డెత్ క్లెయిమ్​లు రావడం ఎల్​ఐసీ చరిత్రలో ఇదే మొదటిసారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కరోనాతో చాలా మంది మృత్యువాత పడుతుండంతో డెత్​ క్లెయిమ్​ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నయని ఎల్​ఐసీ చెబుతోంది. ఇవన్నీ ఫస్ట్​వేవ్​ కేసులేనని, సెకండ్​ వేవ్​లో డెత్​ క్లెయిమ్​ కేసులు మరింగా పెరిగే అవకాశం ఉందని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. పెద్ద ఎత్తున్న డెట్​ క్లెయిమ్​లు చెల్లించాల్సి రావడంతో ఎల్​ఐసీకి భారీ నష్టాలు వస్తున్నాయి. ఫలితంగా, కరోనా మహమ్మారి ఇన్సూరెన్స్​ సెక్టార్​ను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు.
First published:

అగ్ర కథనాలు