రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ డబ్బు చేతిలో ఉండాలంటే... ఈ స్కీమ్స్‌లో చేరండి

Retirement Planning | మీరు మీ రిటైర్మెంట్ తర్వాత డబ్బుల టెన్షన్ లేకుండా హ్యాపీగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ స్కీమ్స్‌లో చేరండి.

news18-telugu
Updated: December 3, 2020, 3:52 PM IST
రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ డబ్బు చేతిలో ఉండాలంటే... ఈ స్కీమ్స్‌లో చేరండి
రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ డబ్బు చేతిలో ఉండాలంటే... ఈ స్కీమ్స్‌లో చేరండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మారుతున్న కాలంతో పాటు పెట్టుబడులపై ఆసక్తి పెంచుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కరోనాతో ప్రజల్లో ఫైనాన్షియల్ అవేర్‌నెస్ పెరగడంతో స్థిరమైన రాబడినిచ్చే పెట్టుబడి మార్గాలవైపు చూస్తున్నారు. అంతేకాక, రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా జీవితాన్ని సాఫీగా గడపడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో తమ డబ్బు పెడుతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ రిస్క్ ఉండే ఈ స్కీమ్‌లో పెట్టుబడికి స్థిరమైన రాబడి వస్తుంది. అందుకే దీన్ని బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్‌గా పరిగణిస్తారు. ఎన్‌పిఎస్ పథకాల్లో పెట్టుబడిపై 10.46 శాతం నుంచి 11.99 శాతం రాబడి లభిస్తుంది.పెన్షన్ ఫండ్ మేనేజర్ 3 ఏళ్ల రిటర్న్స్ 5 ఏళ్ల రిటర్న్స్
ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ 11.99 11.48
HDFC పెన్షన్ ఫండ్ 11.23 10.60
SBI పెన్షన్ ఫండ్ 10.89 10.54
కోటక్ పెన్షన్ ఫండ్ 10.80 10.54
ఐసీఐసీఐ ప్రెడెన్షియల్ పెన్షన్ ఫండ్ 10.77 10.37
బిర్లా సన్ లైఫ్ పెన్షన్ స్కీమ్ 10.72
యూటీఐ రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ 10.46 10.00
డెబ్ట్–గిల్డ్పై 10 ఏళ్ల పెట్టుబడి 10.33 10.38
సీసీఐఎల్ ఆల్ సావరిన్ బాండ్–టీఆర్ఐ 10.39 9.90

WhatsApp New Features: వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ బుకింగ్ చాలా సింపుల్... చేయండి ఇలా

సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు


2020 నవంబర్ 24 నాటికి తీసుకున్న లెక్కల ప్రకారం మూడేళ్లు, ఐదేళ్ల కాలానికి ఎల్ఐసి పెన్షన్ ఫండ్స్లో పెట్టుబడిపై వరుసగా 11.99 శాతం, 11.48 శాతం రాబడి లభించింది. దీనితో పాటు ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్ ఫండ్ కూడా స్థిరమైన పనితీరు కనబరిచింది. ఈ సమయంలోనే హెచ్‌డీఎఫ్‌సీ పెట్టుబడిపై వరుసగా 11.23 శాతం, 10.6 శాతం రాబడి లభించింది. అయితే, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపిఎఫ్)తో పాటు ఈ పథకాలు కూడా మార్కెట్-అనుసంధాన రాబడిని అందిస్తున్నప్పటికీ, పదవీ విరమణ కోణంలో మాత్రం ఎన్‌పిఎస్ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. పెట్టుబడిదారులు ఈక్విటీలు, కార్పొరేట్ రుణాలు, ప్రభుత్వ సెక్యూరిటీస్తో పాటు మొత్తం ఏడు ఎన్‌పిఎస్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. అవి ఎల్‌ఐసి పెన్షన్ ఫండ్, యుటిఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్, ఎస్‌బిఐ పెన్షన్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్, హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్ ఫండ్, కోటక్ పెన్షన్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ పెన్షన్ స్కీమ్ వంటివి ఉన్నాయి.

EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే ఈ 4 ప్రయోజనాలు మీకే

EPFO: మీ ఈపీఎఫ్ అకౌంట్లలో సమస్యలున్నాయా? తెలుగు రాష్ట్రాల వాట్సప్ నెంబర్స్ ఇవే

ఒకవేళ మీరు 50 ఏళ్ల వయసులోపు వారైతే, మీ పెట్టుబడిలో 75 శాతం వరకు యాక్టివ్ ఛాయిస్ కింద ఈక్విటీల కోసం కేటాయించవచ్చు. అదే, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులైతే మీ పెట్టుబడిలో 50 శాతం వరకు ఈక్విటీ కోసం కేటాయించవచ్చు. ఈ విధంగా పెట్టుబడి పెడితే మీ ఈక్విటీ, కార్పొరేట్ రుణాలకు పెట్టుబడి శాతం తగ్గి, ప్రభుత్వ సెక్యూరిటీల వాటా పెరుగుతుంది. మీ పదవీ విరమణ సమయంలో మీ పెట్టుబడిపై అధిక రాబడి వస్తుంది. ఎన్‌పిఎస్‌లో పెట్టుబడిపై సెక్షన్ 80 సి కింద రూ .1.5 లక్షల వరకు, 80 సిసిడి (1 బి) కింద రూ .50 వేల తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు మీ జీతంలో 10 శాతం (ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతం)పై సెక్షన్ 80 సిసిడి (2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: December 3, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading