HOME »NEWS »BUSINESS »lic alert life insurance corporation of india warns policyholders about online frauds ss

LIC: మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు

LIC: మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు
LIC: మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు (ప్రతీకాత్మక చిత్రం)

LIC Alert | ఏజెంట్లు ఇచ్చే డాక్యుమెంట్లు చదవకుండా సంతకం చేయకూడదు. డాక్యుమెంట్ చదవడానికి కొంత సమయం తీసుకున్నా పర్లేదు. నియమనిబంధనలన్నీ చదివితే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.

  • Share this:
    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... ప్రభుత్వరంగానికి చెందిన అతిపెద్ద బీమా సంస్థ. కోట్లాది మంది పాలసీ హోల్డర్లకు సేవలు అందిస్తోంది ఎల్ఐసీ. అయితే ఇటీవల ఎల్ఐసీ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. పాలసీ ల్యాప్స్ అవుతుందని, బోనస్ వచ్చిందని రకరకాల పద్ధతుల్లో పాలసీ హోల్డర్లను మోసం చేస్తున్నారు ఛీటర్లు. నిజంగా ఎల్ఐసీ అధికారులే తమను సంప్రదించారనుకొని మోసపోతున్నారు పాలసీహోల్డర్లు. కాస్త అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు. మరి మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? మోసగాళ్లు మిమ్మల్నీ టార్గెట్ చేయొచ్చు. అందుకే ఎల్ఐసీ పాలసీల లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. మరి పాలసీ హోల్డర్లు కాల్స్, మెసేజెస్, ఇమెయిల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా అలర్ట్‌గా ఉండాలో ఎల్ఐసీ వివరిస్తోంది. ఎల్ఐసీ ఇస్తున్న సలహాలు, సూచనలు ఇవే...

    ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తున్నారా? కాస్త జాగ్రత్త. చెక్ ద్వారానే ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించాలి. అది కూడా ఎల్ఐసీ పేరు మీదే చెక్ ఇవ్వాలి. ఇతరుల పేర్ల మీద చెక్ ఇవ్వాలని అడిగితే అస్సలు ఒప్పుకోవద్దు. లేదా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయచ్చు. అది కూడా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎల్ఐసీతో ఒప్పందం చేసుకున్న పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాలసీ ప్రీమియం చెల్లించొచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ www.licindia.in అప్పుడప్పుడూ ఓపెన్ చేస్తూ పాలసీ స్టేటస్ చూస్తుండాలి. పాలసీ అప్‌డేట్స్ తెలుసుకోవాలి. ఏజెంట్లు ఇచ్చే డాక్యుమెంట్లు చదవకుండా సంతకం చేయకూడదు. డాక్యుమెంట్ చదవడానికి కొంత సమయం తీసుకున్నా పర్లేదు. నియమనిబంధనలన్నీ చదివితే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.



    ఎట్టిపరిస్థితుల్లో మీ ఎల్ఐసీ పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరికీ ఇవ్వకూడదు. మీ పాలసీ బాండ్ తీసుకునే అధికారం ఎవరికీ లేదు. ఎల్ఐసీ ఆఫర్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దు. ఎల్ఐసీ ఏజెంట్ పేరుతో సంప్రదించినా పాలసీ తీసుకునే ముందు ఏజెంట్ ఐడీ కార్డ్ చూడండి. బోనస్ లేదా ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్స్ కోసం ఎల్ఐసీ సంస్థ పాలసీహోల్డర్లను ఫోన్‌లో సంప్రదించదు. అలాంటి కాల్స్ అన్నీ మోసపూరితం అన్న విషయం గుర్తుంచుకోండి. ఏదైనా అనుమానం ఉంటే, ఎవరైనా ట్రాప్ చేయాలని చూస్తే ఎల్ఐసీ బ్రాంచ్‌లో లేదా co_fraud@licindia.com ఇమెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు.

    Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Smartphone: స్మార్ట్‌ఫోన్ వాడితే కొమ్ములు వస్తున్నాయి... ఇదిగో సాక్ష్యం

    Bamboo Business: వెదురు పంటతో లక్షల్లో ఆదాయం... ఆ ఐడియా ఇదే

    Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి
    Published by:Santhosh Kumar S
    First published:June 21, 2019, 17:39 IST