ఆమ్ ఆద్మీ బీమా యోజన... లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ స్కీమ్ అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం రూపొందించిన సామాజిక భద్రతా పథకం. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వాళ్లు ఈ పథకంలో చేరొచ్చు. రూ.30,000 కవరేజీ లభిస్తుంది. అసలు ఈ ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకమేంటీ? ఈ పథకంతో ఎంత లాభం? ఈ స్కీమ్‌లో ఎలా చేరాలి? తెలుసుకోండి.
ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన అర్హతలు
ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో చేరాలనుకునేవారి వయస్సు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు ఉండాలి. ఏజ్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు, బర్త్ రిజిస్టర్లో నమోదైన రికార్డు, స్కూల్ సర్టిఫికెట్, ఓటర్ లిస్ట్, ప్రభుత్వ శాఖ లేదా ప్రముఖ సంస్థ జారీ చేసిన ఐడీ కార్డు, ఆధార్ కార్డులో ఏదైనా ఒకటి ఉండాలి.
ఇంటి యజమాని లేదా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబంలో ఒకరే సంపాదిస్తుంటే లేదా దారిద్ర్యరేఖకు స్వల్పంగా పైన ఉండి భూమి లేని, గుర్తించబడిన వృత్తులు చేసుకునేవాళ్లు అర్హులు.
ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో చేరినవాళ్లు వార్షికంగా రూ.200 ప్రీమియం చెల్లించాలి. వారికి రూ.30,000 కవరేజీ లభిస్తుంది. సహజ మరణమైతే రూ.30,000, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.75,000 బీమా లభిస్తుంది. శాశ్వత వైకల్యం, ప్రమాదంలో రెండు కళ్లు లేదా రెండు అవయవాలు పోయినా, ఒక కన్ను, ఒక అవయవం పాడైనా రూ.75,000 లభిస్తుంది. ఒక కన్ను లేదా ఒక అవయవం కోల్పోతే రూ.37,500 బీమా ఇస్తారు.
Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.