LIC Aadhaar Shila Plan: ఎల్ఐసీలో ఈ పాలసీ మహిళలకు మాత్రమే... లాభాలు ఇవే

LIC Aadhaar Shila Plan | ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్. ఆధార్ కార్డు ఉన్న మహిళలకు ప్రత్యేకంగా ఓ పాలసీ అందిస్తోంది ఎల్ఐసీ. పాలసీ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: November 11, 2020, 3:42 PM IST
LIC Aadhaar Shila Plan: ఎల్ఐసీలో ఈ పాలసీ మహిళలకు మాత్రమే... లాభాలు ఇవే
LIC Aadhaar Shila Plan: ఎల్ఐసీలో ఈ పాలసీ మహిళలకు మాత్రమే... లాభాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మహిళలకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పాలసీ అందిస్తోంది. ఆ పాలసీ పేరు 'ఎల్ఐసీ ఆధార్ శిల' ప్లాన్. ఆధార్ కార్డు ఉన్న మహిళలందరూ ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకోవడానికి ఎలాంటి ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు. పాలసీ ముగిసేలోపు పాలసీ తీసుకున్న మహిళ చనిపోతే ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఈ పాలసీ కేవలం మహిళలకు మాత్రమే. ప్రీమియం తక్కువగా ఉంటుంది. పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మరణిస్తే లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది. ఈ పాలసీలో క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత లోన్ సదుపాయం కూడా ఉంటుంది. పాలసీతో పాటు ఎల్ఐసీ యాక్సిడెంటల్ రైడర్, పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్ కూడా తీసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు.

Gold Price Today: ధంతేరాస్ ముందు బంగారం ధరలు ఢమాల్... ఒక్క రోజులోనే రూ.1500 పతనం

Gold: ధంతేరాస్‌కు ముందు బంపరాఫర్... మార్కెట్ రేటుకన్నా తక్కువకే బంగారం

ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకోవడానికి కనీసం 8 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 55 ఏళ్ల వయస్సు ఉన్నవారెవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 20 ఏళ్లు. సమ్ అష్యూర్డ్ కనీసం రూ.75,000 నుంచి రూ.3,00,000 మధ్య తీసుకోవచ్చు. ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి చెల్లించొచ్చు. ఏడాది ప్రీమియం ఎంచుకుంటే 2 శాతం ప్రీమియం తగ్గుతుంది. పాలసీ ముగిసేవరకు జీవించి ఉంటే సమ్ అష్యూర్డ్‌తో పాటు లాయల్టీ అడిషన్ వస్తుంది. పాలసీ తీసుకున్న మొదటి ఐదేళ్లలో మరణిస్తే బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు 110 శాతం లభిస్తుంది. ఐదేళ్ల తర్వాత మరణిస్తే బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు 110 శాతంతో పాటు లాయల్టీ అడిషన్ లభిస్తుంది. పాలసీ తీసుకున్న రోజు నుంచే రిస్క్ కవర్ ఈ పాలసీ ప్రత్యేకత.

IRCTC Kerala Tour: హౌజ్ బోట్‌లో స్టేతో కేరళ టూర్... ప్యాకేజీ ధర తెలిస్తే షాకే

Vivo Diwali Offer: రూ.101 ఇచ్చి మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనండి... దివాళీ స్పెషల్ ఆఫర్

ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీకి సంబంధించి లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC వెబ్‌సైట్‌లో ఉన్న ఉదాహరణ చూస్తే 35 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 20 ఏళ్లకు రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌కు పాలసీ తీసుకున్నారనుకుందాం. ఏడాదికి ప్రీమియం రూ.3,699 చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్లకు రూ.18,495 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత మరణిస్తే రూ.1,10,000 డెత్ బెనిఫిట్స్ వస్తుంది. 20 ఏళ్లు పూర్తిగా ప్రీమియంలు చెల్లిస్తే రూ.73,980 చెల్లించాలి. మెచ్యూరిటీ తర్వాత రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో పాటు రూ.16,500 వరకు లాయల్టీ అడిషన్ వచ్చే అవకాశముంది.
Published by: Santhosh Kumar S
First published: November 11, 2020, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading