మీరు ఏదైనా పొదుపు పథకం కోసం సెర్చ్ చేస్తున్నారా? మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఆధార్ స్తంభ్ పేరుతో ఓ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ కేవలం ఆధార్ కార్డ్ ఉన్న పురుషులకు మాత్రమే. ఈ పాలసీలో రోజూ రూ.28 లెక్కన పొదుపు చేస్తే పాలసీ మెచ్యూర్ అయ్యాక సుమారు రూ.3.97 లక్షలు చేతికి వస్తాయని అంచనా. మరి ఈ పాలసీ తీసుకోవడానికి అర్హతలేంటీ? ఎంత లాభం ఉంటుంది? తెలుసుకోండి.
కనీస వయస్సు- 8 ఏళ్లు
గరిష్ట వయస్సు- 55 ఏళ్లు
కనీస సమ్ అష్యూర్డ్- రూ.75,000
గరిష్ట సమ్ అష్యూర్డ్- రూ.3,00,000
పాలసీ గడువు- 10 నుంచి 20 ఏళ్లు
ప్రీమియం చెల్లింపు- మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, డైలీ
ఎవరికి- ఆధార్ కార్డ్ ఉన్న పురుషులకు మాత్రమే
డెత్ బెనిఫిట్: మొదటి ఐదేళ్లలో చనిపోతే 'సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్' చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత చనిపోతే 'సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్'+లాయల్టీ అడిషన్ చెల్లిస్తారు.
28 ఏళ్ల వయస్సు గల వ్యక్తి రూ.3,00,000 సమ్ అష్యూర్డ్‌కు పాలసీ తీసుకున్నాడనుకుందాం. పాలసీ గడువు 20 ఏళ్లు. ఏటా చెల్లించాల్సిన ప్రీమియం రూ.10,314. అంటే రోజుకు రూ.28 చెల్లించాలి. 20 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.2,06,280. మెచ్యూరిటీ తర్వాత రూ.3,00,000 వస్తుంది. దీంతో పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఏటా 4.5 శాతం చొప్పున లాయల్టీ అడిషన్ రూ.97,500 వస్తుంది. అంటే మొత్తం రూ.3,97,500 రిటర్న్స్ పొందొచ్చు.
ఇవి కూడా చదవండి:
Fixed Deposits: ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకోండి
PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
Gold: అదిరిపోయే ఆఫర్... మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... కొనండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, Investment Plans, LIC, Money, Money making, Personal Finance, Save Money, TAX SAVING