Home /News /business /

LIC AADHAAR SHILA POLICY OFFERS UP TO RS 4 LAKHS RETURNS BY SAVING JUST RS 29 PER DAY KNOW ABOUT THIS PLAN DETAILS SS

LIC Policy: ఎల్ఐసీ నుంచి సూపర్ పాలసీ... రోజూ రూ.29 చొప్పున జమ చేస్తే రూ.4 లక్షలు మీవే

LIC Policy: ఎల్ఐసీ నుంచి సూపర్ పాలసీ... రోజూ రూ.29 చొప్పున జమ చేస్తే రూ.4 లక్షలు మీవే
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy: ఎల్ఐసీ నుంచి సూపర్ పాలసీ... రోజూ రూ.29 చొప్పున జమ చేస్తే రూ.4 లక్షలు మీవే (ప్రతీకాత్మక చిత్రం)

LIC Aadhaar Shila Policy | ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునే మహిళల కోసం ఓ ప్రత్యేక పాలసీ అందిస్తోంది ఎల్ఐసీ. ఈ పాలసీలో రోజూ రూ.29 చొప్పున జమ చేస్తే రూ.4,00,000 వరకు రిటర్న్స్ పొందొచ్చు.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వేర్వేరు వర్గాలకు పలు రకాల ఇన్స్యూరెన్స్ పాలసీలను అందిస్తోంది. పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు, మహిళలకు వేర్వేరుగా ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. మహిళలు, ఆడపిల్లల కోసం ఎల్ఐసీ నుంచి ఓ ప్రత్యేక పాలసీ ఉంది. ఎల్ఐసీ ఆధార్ శిల ప్లాన్ (LIC Aadhaar Shila Plan) పేరుతో ఈ పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే ఇందులో రోజూ రూ.29 చొప్పున జమ చేస్తే చాలు మెచ్యూరిటీ సమయంలో రూ.4,00,000 రిటర్న్స్ పొందొచ్చు. ఎల్ఐసీ అతితక్కువ ప్రీమియంతో అందిస్తున్న పాలసీల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ పాలసీ కేవలం మహిళలకు మాత్రమే.

ఎల్ఐసీ ఆధార్ శిల ప్లాన్ వివరాలివే


ఎల్ఐసీ ఆధార్ శిల ప్లాన్‌ను మహిళలు, ఆడపిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఈ పాలసీ తీసుకోవాలంటే పాలసీహోల్డర్‌కు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా కావాలి. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు అందరికీ ఆధార్ కార్డ్ లభించింది కాబట్టి మహిళలు, అమ్మాయిలు ఎవరైనా ఈ పాలసీ సులువుగా తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు కూడా అవసరం లేదు. వయస్సు వివరాలు చూస్తే కనీసం 8 ఏళ్ల నుంచి గరిష్టంగా 55 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పాలసీకి అప్లై చేయొచ్చు. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల గడువుతో పాలసీ తీసుకోవాలి.

SBI ATM: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఇలా చేస్తే మోసాలకు బ్రేక్ వేయొచ్చు

ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీలో కనీసం రూ.75,000 సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట సమ్ అష్యూర్డ్ రూ.3,00,000. పాలసీహోల్డర్లు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఆప్షన్స్‌తో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ వివరాలు చూస్తే పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే రిస్క్ కవర్ ఉంటుంది. పాలసీహోల్డర్ పాలసీ తీసుకున్న ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్‌కు 110 శాతం నామినీకి లభిస్తుంది. పాలసీహోల్డర్ ఐదేళ్ల తర్వాత మరణిస్తే సమ్ అష్యూర్డ్‌తో పాటు లాయల్టీ అడిషన్ లభిస్తుంది. ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకునేవారికి ఎల్ఐసీ యాక్సిడెంటల్ రైడర్, పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్స్ ఉంటాయి.

Money Saving Tips: నెలకు రూ.1,000 పొదుపు చేసినా కోటీశ్వరులు కావొచ్చు ఇలా

ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 20 ఏళ్ల కాలానికి ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. ఏడాదికి రూ.10,585 చొప్పున ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.29 చొప్పున చెల్లించాలి. పన్నులు కలిపి 20 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.2,14,696 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.3,97,000 వరకు రిటర్న్స్ వస్తాయి.

ఎక్కువగా ప్రీమియం చెల్లించలేనివారు రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవచ్చు. 35 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 20 ఏళ్లకు ఈ పాలసీ తీసుకుంటే ఏడాదికి ప్రీమియం రూ.3,709 + ట్యాక్సులు చెల్లించాలి. 20 ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.74,180 అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌ + రూ.16,500 లాయల్టీ అడిషన్ కలిపి మొత్తం రూ.1,16,500 రిటర్న్స్ వస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు