ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో దాదాపు అన్ని శాఖల పనులు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కాగితాలు చేతపట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు పోయాయనే చెప్పాలి. భారతదేశంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే (Phone Pe) మున్సిపల్ టాక్స్ చెల్లింపులతో సహా అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే అందజేస్తోంది. ఈ సంస్థ డిజిటల్ పద్ధతుల్లో బీమా పాలసీ (Insurance policy)లను విక్రయించడంలో కూడా అగ్రగామిగా అవతరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (Liberty General Insurance Limited) కూడా ఫోన్ పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పార్ట్‌నర్‌షిప్ తో యూజర్లు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ (Motor Insurance Policy)ని ఫోన్‌పే ద్వారా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. వాహన బీమా కొనుగోలు చేయాలనుకునే ఫోన్ పే యూజర్లకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
5 నెలల్లోనే 5 లక్షలకు పైగా ఇన్సూరెన్స్ పాలసీలు..
తొలిరోజుల్లో కొన్ని సేవలకే పరిమితమైన ఫోన్ పే (phonepe) సంస్థ 2020లో ఇన్సూరెన్స్ పాలసీ పంపిణీలో కూడా అడుగుపెట్టింది. ఇది 5 నెలలోనే 5 లక్షలకు పైగా తన వినియోగదారులకు ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించింది. ఈ నేపథ్యంలో తాజాగా లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ కూడా ఫోన్ పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది తన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ (Motor Insurance Policy)ని డిజిటల్ ప్రియులకు చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఫోన్ పేతో పార్ట్‌నర్‌షిప్ పెట్టుకుంది.
ఉత్తమ ప్రొటెక్షన్ కవర్..
ఈ భాగస్వామ్యంతో ఫోన్ పేతో తమ అనుబంధం బలోపేతమవుతుందని.. తద్వారా ఫోన్ పే కస్టమర్లు ఉత్తమ ప్రొటెక్షన్ కవర్ కొనుగోలు చేయగలుగుతారని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ (Liberty General Insurance Limited) సీఈఓ రూపమ్ అస్థాన (Roopam Asthana) పేర్కొన్నారు. లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కలిగివున్న సమగ్రమైన బీమా ప్రొడక్ట్స్ అనేవి తమను మార్కెట్లో ఉన్న ఇతర మోటారు బీమా ప్రొడక్ట్స్ (Motor Insurance products) నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయని సీఈఓ & హోల్-టైమ్ డైరెక్టర్ రూపమ్ అస్థాన తెలిపారు.
క్షణాల వ్యవధిలోనే ఇన్సూరెన్స్..
తాజాగా కుదుర్చుకున్న భాగస్వామ్యంపై ఫోన్ పే (phone pe) హెడ్ గుంజన్ గాయ్ కూడా మాట్లాడారు. "32 కోట్ల ఫోన్ పే యూజర్లకు మోటార్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అందించడానికి మేం లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ (Liberty General Insurance Limited) తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. ఫోన్ పే ప్లాట్‌ఫామ్ ద్వారా యూజర్లు క్షణాల వ్యవధిలోనే రకరకాల మోటార్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. మేం ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌ను ఇన్సూరెన్స్ అవసరాలకు వన్ స్టాప్ డెస్టినేషన్ గా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాం. తాజా భాగస్వామ్యంతో ఆ దిశగా మరో అడుగు ముందుకు పడింది." అని గుంజన్ గాయ్ వెల్లడించారు.
ఫోన్ పే సంస్థ 2017లో ఆర్థిక సేవలలో కాలు మోపింది. మొదటగా ఇది తన ప్లాట్‌ఫామ్ వేదికగా 24 క్యారెట్ గోల్డ్ (Carrot gold) విక్రయించింది. తర్వాత మ్యూచువల్ ఫండ్లు (mutual funds), ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, టాక్స్ సేవింగ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) తదితర సేవలను తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apply online, Insurance, PhonePe, Vehicles