మార్కెట్ లోకి లీ ఫార్మా కోవిడ్‌–19 కిట్ విడుద‌ల...ఫోన్ చేస్తే చాలు హోండెలివరీ...

వైద్యుల సూచన మేరకు ఫావిపిరావిర్‌–200 ఎంజీ శ్రేణిలో 34 ట్యాబ్లెట్లను రోగి ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తారు.

news18-telugu
Updated: November 25, 2020, 10:18 PM IST
మార్కెట్ లోకి లీ ఫార్మా కోవిడ్‌–19 కిట్ విడుద‌ల...ఫోన్ చేస్తే చాలు హోండెలివరీ...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఔషధ తయారీ రంగంలో ఉన్న లీ ఫార్మాకు చెందిన లీ హెల్త్‌ డొమెయిన్‌.. కోవిడ్‌–19 నిరోధానికి ప్రత్యేక కిట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కిట్‌లో కంపెనీ రూపొందించిన రోల్‌ ఆన్‌ కోల్డ్, స్టీమ్‌ మంత్ర, వస తులసి, ప్యారాసిటమాల్‌ 650 ఎంజీ ట్యాబ్లెట్స్, లెవోసెట్రిజిన్‌+మాంటిలుకాస్ట్‌ ట్యాబ్లెట్స్, అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ ట్యాబ్లెట్స్, యాక్టివ్‌ ప్లస్‌ మల్టీ విటమిన్‌ క్యాప్యూల్స్‌ ఉన్నాయి. వీటితోపాటు సానిటైజర్, మాస్కులను సైతం జోడించారు. ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి ఈ కిట్‌ పెద్ద ఉపశమనం అని కంపెనీ డైరెక్టర్‌ లీలా రాణి తెలిపారు. కోవిడ్‌–19 రోగులు ఫోన్‌ కన్సల్టెన్సీ ద్వారా వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవడం ద్వారా ఆసుపత్రి బిల్లులను నివారించవచ్చని అన్నారు. డోర్‌ డెలివరీతో కలిపి ఈ కిట్‌ ధర రూ.900లుగా కంపెనీ నిర్ణయించింది.

అలాగే వైద్యుల సూచన మేరకు ఫావిపిరావిర్‌–200 ఎంజీ శ్రేణిలో 34 ట్యాబ్లెట్లను రోగి ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తారు. ఈ ట్యాబ్లెట్ల కాటన్‌ ధర రూ.700. ప్రిస్క్రిప్షన్‌ను 7702122599 నంబరుకు వాట్సాప్‌ చేయాల్సి ఉంటుంది. 7702000437 నంబరుకు గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే ద్వారా నగదు పంపాలి.
Published by: Krishna Adithya
First published: November 25, 2020, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading