LED LCD TELEVISIONS MAY GET CHEAPER AS MODI GOVT SCRAPS 5 PERCENT IMPORT DUTY BS
భారీగా తగ్గనున్న టీవీల ధరలు.. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. టీవీలు తయారు చేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గిస్తూ మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. టీవీలు తయారు చేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గిస్తూ మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పరికరాలపై 7.5 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచారు. దాన్ని ఇప్పుడు భారీగా తగ్గించారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘ఓపెన్ బ్యాటరీ, 15.6 అంగుళాల కంటే పైన, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే(ఎల్సీడీ), లైట్ ఎమిటింగ్ డయోడ్(ఎల్ఈడీ)ల టీవీల ప్యానెల్లు భారీగా తగ్గనున్నాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితోపాటు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు(pcb), ఫిల్మ్ చిప్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని రద్దు చేశారు.
కాగా, ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెళ్లు అతి ముఖ్యమైనవి. టీవీ తయారీలో సగం ఖర్చు దీనిపైనే వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల తయారీ ఖర్చు తగ్గనుంది. ఫలితంగా టీవీ అమ్మకం ధరలు కూడా తగ్గనున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.