హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO Alert: ఉద్యోగులకు అలర్ట్... వారికి కూడా రూ.7 లక్షల వరకు బెనిఫిట్ వర్తిస్తుందన్న ఈపీఎఫ్ఓ

EPFO Alert: ఉద్యోగులకు అలర్ట్... వారికి కూడా రూ.7 లక్షల వరకు బెనిఫిట్ వర్తిస్తుందన్న ఈపీఎఫ్ఓ

EPFO Alert: ఉద్యోగులకు అలర్ట్... వారికి కూడా రూ.7 లక్షల వరకు బెనిఫిట్ వర్తిస్తుందన్న ఈపీఎఫ్ఓ
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO Alert: ఉద్యోగులకు అలర్ట్... వారికి కూడా రూ.7 లక్షల వరకు బెనిఫిట్ వర్తిస్తుందన్న ఈపీఎఫ్ఓ (ప్రతీకాత్మక చిత్రం)

EPFO Alert | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ ఖాతాదారులకు ఓ క్లారిటీ ఇచ్చింది. జీతం తీసుకోకుండా సెలవులో ఉన్నవారికి కూడా రూ.7 లక్షల వరకు బెనిఫిట్ వర్తిస్తుందని తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సబ్‌స్క్రైబర్లకు అలర్ట్. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌కు (EDLI Scheme) సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). లీవ్ వితవుట్ పే అంటే వేతనం లేకుండా సెలవులో ఉన్నవారికి కూడా EDLI స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీతం లేకుండా సెలవులో ఉన్న ఉద్యోగి మరణిస్తే వార నామినీ EDLI స్కీమ్ ద్వారా ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. సదరు ఉద్యోగి దీర్ఘకాలంపాటు సెలవులో ఉన్న కారణంగా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లోకి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ జమ కాకపోయినా బీమా ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేసింది.

అయితే జీతం లేకుండా సెలవులో ఉన్న ఈపీఎఫ్ సభ్యుడు మరణించిన రోజు వరకు రిక్రూటర్ మస్టర్ రోల్‌లో ఉండాలని, EDLI స్కీమ్ ద్వారా వారి నామినీ ప్రయోజనం పొందడానికి, క్లెయిమ్ చేయడానికి కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఒక ఉద్యోగి వేతనాలు లేకుండా సెలవులో ఉన్నట్లయితే, గైర్హాజరీలో ఉన్నా, ఆ సమయంలో మరణిస్తే, ఆ రోజు వరకు సదరు ఉద్యోగి మస్టర్ రోల్స్‌లో ఉండి, సూచించిన షరతులను సంతృప్తి పరచినట్టయితే ఈ స్కీమ్ వర్తిస్తుందని ఈపీఎఫ్ఓ తాజాగా ఓ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది.

Aadhaar Download: ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? UIDAI సలహా పాటించండి

సర్వీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి చనిపోతే, గత కొన్ని రోజులుగా పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందడంలేదని కొన్ని కార్యాలయాలు, EDLI స్కీమ్ బెనిఫిట్స్ అందించకుండా క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నాయని తమకు ఫిర్యాదులు అందినట్టు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. మరణించిన PF ఖాతాదారుని కుటుంబ సభ్యులను వేధించకుండా ఉండేందుకు సంస్థలకు పలు సూచనలు చేసింది ఈపీఎఫ్ఓ. డ్యూ వెరిఫికేషన్ చేయాలని, 7 రోజుల్లో పూర్తి చేయాలని, ఈపీఎఫ్ ఖాతాదారుల కుటుంబ సభ్యులను వేధించకూడదని, సభ్యుడు మస్టర్ రోల్స్‌లో ఉన్నారని యజమాని వెల్లడిస్తే, యజమాని వివరణ తమకు ఎందుకు ఆమోదయోగ్యం కాదన్న కారణాన్ని వెల్లడించి, దీనిపై ఆఫీసులో పరిశీలించాలని స్పష్టం చేసింది.

ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో, ప్రకృతి విపత్తులో, మరే ఇతర కారణాలతో అయినా మరణిస్తే సదరు ఈపీఎఫ్ ఖాతాదారు కుటుంబానికి రూ.7,00,000 వరకు బీమా మొత్తం లభిస్తుంది. ఈ ఇన్స్యూరెన్స్ పొందడానికి పలు నియమనిబంధనలు ఉన్నాయి. సర్వీసులో ఉండగా మరణించిన ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్‌కు మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది.

Gold Price Today: ధంతేరాస్‌కు 3 రోజుల ముందు శుభవార్త... తగ్గిన గోల్డ్ రేట్

ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ మరణించడానికి ముందు 12 నెలల పాటు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సంస్థల్లో పనిచేసినా వారి కుటుంబ సభ్యులు బీమా ప్రయోజనం పొందొచ్చు. ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ యాజమాన్యం ఉద్యోగి బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్టంగా రూ.75 ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా బేసిక్ వేతనం రూ.15,000 లోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. బేసిక్ వేతనం రూ.15,000 దాటితే గరిష్టంగా రూ.7,00,000 లక్షల వరకు బీమా ప్రయోజనాలు పొందవచ్చు.

చివరి 12 నెలల్లో ఉన్న బేసిక్ వేతనానికి 35 రెట్లు+రూ.1,75,000 బోనస్ కలిపి బీమా మొత్తాన్ని మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు చెల్లిస్తుంది ఈపీఎఫ్ఓ. ఉదాహరణకు బేసిక్ వేతనం రూ.15,000 అయితే రూ.15,000x35= రూ.5,25,000 అవుతుంది. రూ.5,25,000+రూ.1,75,000 బోనస్‌తో కలిపి గరిష్టంగా రూ.7,00,000 మాత్రమే లభిస్తుంది. ఒకవేళ బేసిక్ వేతనం రూ.10,000 అయితే రూ.10,000x35= రూ.3,50,000 అవుతుంది. రూ.3,50,000+రూ.1,75,000 బోనస్‌తో కలిపి రూ.5,25,000 బీమా లభిస్తుంది. కనీసం రూ.2,50,000 నుంచి రూ.7,00,000 మధ్య బీమా ప్రయోజనాలు లభిస్తాయి.

First published:

Tags: Epf, EPFO, Insurance, Personal Finance, PF account