హోమ్ /వార్తలు /బిజినెస్ /

Employees: ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి బొనాంజా..

Employees: ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి బొనాంజా..

ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి బొనాంజా..

ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి బొనాంజా..

7th Pay Commission | దీపావళి కన్నా ముందే ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. లీవ్ ట్రావెల్ కన్షీయన్ సదుాపయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు ఊరట కలుగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

LTC | ఉద్యోగులకు తీపికబురు. దీపావళి (Diwali) ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రభుత్వం తాజాగా లీవ్ ట్రావెల్ కన్సిషన్ (ఎల్‌టీసీ) స్కీమ్ గడువును పొడిగిస్తూ  ఒక మెమరాండమ్‌ను జారీ చేసింది.దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Employees) ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ మరో రెండేళ్ల పాటు అందుబాటులో ఉండనుంది.

ఉద్యోగులకు ఈశాన్య ప్రాంతం, జమ్మూ, కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్ దీవులను సందర్శించడానికి విమానంలో ప్రయాణానికి సడలింపును అనుమతించే పథకాన్ని ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీసీఎస్ (ఎల్‌టీసీ) రూల్స్ 1988 సవరించినట్లు కేంద్రం తెలిపింది. లీవ్ ట్రావెల్ కన్షీషన్ ప్రయోజనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2024 సెప్టెంబర్ నెల 25 వరకు అందుబాటులో ఉండనుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త.. ఇకపై కస్టమర్లకు..

ఎల్‌టీసీ బెనిఫిట్ పొందాలని భావించే ఉద్యోగులు కచ్చితంగా కొన్ని విషయాన్ని గుర్తించుకోవాలి. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు అందరూ నాలుగు సంవత్సరాల పీరియడ్‌లో వారి ఒకసారి ఈశాన్య ప్రాంతం, జమ్మూ, కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లడఖ్‌లోని ఏదైనా ప్రదేశాన్ని సందర్శించడానికి ఎల్‌టీసీని పొందొచ్చు. అయితే హోమ్ టౌన్, హెడ్‌క్వార్టర్స్/పోస్టింగ్ స్థలం ఒకేలా ఉంటే అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు హోమ్ టౌన్ ఎల్‌టీసీ సదుపాయానికి పొందటానికి అనర్హులు అని గుర్తించుకోవాలి.

ఉచితంగా విమాన టిక్కెట్లు.. హాంగ్‌ కాంగ్‌ చుట్టేసిరండి!

ఒకవేళ ఈశాన్య ప్రాంతం, జమ్మూ, కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లడఖ్‌లో స్వస్థలం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ స్కీమ్‌ను పొందొచ్చు. స్వస్థలం కాకుండా ఇతర మూడు ప్రాంతాల్లో ఏదైనా ప్రదేశాన్ని సందర్శించొచ్చు. విమానంలో ప్రయాణించే అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఈ రాయితీని ఏ ఎయిర్‌లైన్‌లో అయినా అర్హమైన క్లాస్‌లో ప్రయాణించి పొందవచ్చు. అయితే దీనికి నిర్దిష్ట నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.

అలాగే విమానంలో ప్రయాణించడానికి అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ప్రధాన కార్యాలయం నుండి నేరుగా ఈశాన్య ప్రాంతం, జమ్మూ, కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లడఖ్‌లోని ఏ ప్రదేశానికి అయినా ఏ ఎయిర్‌లైన్స్‌లో అయినా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. అయితే రీయింబర్స్‌మెంట్‌పై కొన్ని షరతులు ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగులు ఈ ఫెసిలిటీని దుర్వినియోగం చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఎల్‌టీసీ దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఉద్యోగులు సమర్పించిన విమాన టిక్కెట్లను పరిశీలిస్తారు.

First published:

Tags: 7th Pay Commission, Central govt employees, Employees

ఉత్తమ కథలు